బ్లాక్ ఫంగస్ కేసులు.. వారిలోనే ఎక్కువ..!

కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే దేశంలో తగ్గుముఖం పడుతోంది. నాలుగు లక్షల కేసుల నుంచి లక్ష కేసులకు చేరుకున్నాం. అయితే.. కరోనాతోపాటు.. దేశ ప్రజలను బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. ఈ బ్లాక్ ఫంగస్ కేసులు సైతం వేలల్లో నమోదౌతూనే ఉన్నాయి.

అయితే.. ఈ బ్లాక్ ఫంగస్ ఎక్కువగా పురుషుల మీదే ప్రభావం చూపిస్తోందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. బ్లాక్ ఫంగ‌స్ వ‌చ్చిన వారిలో క‌రోనా బారిన ప‌డి కోలుకున్న వారే అధిక‌మ‌ని, అందులోనూ పురుషులే 80శాతం మంది ఉన్నార‌ని తాజాగా ఓ అధ్య‌య‌నంలో తేలింది. కోవిడ్ సోక‌ని వారిలోనూ 64శాతం బ్లాక్ ఫంగస్ కేసులు పురుషుల్లోనే ఉన్నాయి.

ఇక బ్లాక్ ఫంగ‌స్ వ‌చ్చిన వారిలో షుగ‌ర్ పేషెంట్లు ఎక్కువ‌గా ఉన్నార‌న్నారు. అందులోనూ షుగ‌ర్ తో బాధ‌పడుతున్న పురుషులే ఎక్కువ‌ని ఆ అధ్య‌య‌నం తేల్చింది. బ్లాక్ ఫంగ‌స్ వ‌చ్చిన వారు స‌రైన స‌మ‌యంలో చికిత్స తీసుకోక‌పోతే 12వారాల్లో మ‌ర‌ణించే అవ‌కాశం ఉంద‌ని ఆ అధ్య‌య‌నం హెచ్చ‌రించింది.

అమెరికాకు చెందిన సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్ష‌న్ ఆద్వ‌ర్యంలో దాదాపు 16 వైద్య సంస్థ‌లు చేసిన అధ్య‌య‌నంలో ఈ విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. దేశంలో ఫ‌స్ట్ వేవ్ ముగిసిన త‌ర్వాత ఈ అధ్య‌య‌నం జ‌రిగింది.

బ్లాక్ ఫంగస్ ముక్కు, క‌న్ను, ఊపిరితిత్తులు, ముత్ర‌పిండాలు, చ‌ర్మంపై ప్ర‌భావం ఎక్కువ‌ ప్రభావం చూపిస్తోందట. దీనిని వెంటనే గుర్తించకుంటే.. 6 నుంచి 12 వారాల్లో మరణించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.