కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత తగ్గకముందే థర్డ్ వేవ్ గురించి భయపడుతున్న జనాలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అందరు ఆందోళనపడుతున్నట్లు థర్డ్ వేవ్ అంత ప్రమాధకరం కాదని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. థర్డ్ వేవ్ ప్రధానంగా చిన్న పిల్లలపైనే ప్రభావం చూపుతుందని ఆందోళనలో ఉన్న తల్లి, దండ్రులకు గులేరియా ప్రకటన పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి.
మూడో దశకలో కరోనా వైరస్ ప్రధానంగా చిన్నపిల్లలపైనే ప్రభావం చూపుతుందనటానికి సరైన ఆధారాలు లేవన్నారు. అంతమాత్రాన జనాలకు అజాగ్రత్తగా ఉంటే కొంపముణిగిపోవటం ఖాయమని కూడా హెచ్చరించారు. కరోనా వైరస్ ఇంత తీవ్రంగా వ్యాపించటానికి, ఇన్ని వేరియంట్లు పుట్టుకురావటానికి మనమే కారణమని ఘాటుగా వ్యాఖ్యానించారు.
కోవిడ్ నిబంధనలను ఏమాత్రం లెక్కచేయకుండా జనాలంతా రోడ్లపై తిరిగేయటం వల్లే కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చినట్లు చెప్పారు. కరోనా వైరస్ తీవ్రత తగ్గాలన్నా, కొత్త వేరియంట్లు పుట్టటం ఆగిపోవాలన్నా జనాలంతా కచ్చితంగా కరోనా నిబంధనలను పాటించాల్సిందే అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ లో ఇబ్బందులు పడినవారిలో కూడా చిన్నపిల్లలున్న విషయాన్ని గులేరియా గుర్తుచేశారు.
కరోనా తీవ్రత, వేరియంట్ల పుట్టుకపై గులేరియా చెప్పింది నూటికి నూరుశాతం కరెక్టే అనటంలో సందేహం లేదు. ఒకవైపు ప్రభుత్వాలు లాక్ డౌన్ అని కర్ఫ్యూలని ఎంత కట్టడి చేస్తున్నా చాలాచోట్ల జనాలు రోడ్లపైనే కనబడుతున్నారు. నిబంధనలను కచ్చితంగా పాటించాలని చెబుతున్న పోలీసులపై జనాలు ఎంతలా తిరగబడుతున్నది అందరు చూస్తున్నదే. మనంతట మనమే కరోనా వైరస్ ను మనింట్లోకి ఆహ్వానిస్తున్నాం కాబట్టి చిచ్చు పెడుతున్నది.
Gulte Telugu Telugu Political and Movie News Updates