ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. మరో సరికొత్త ఫీచర్ తో మన ముందుకు రానుంది. వినియోగదారుల సౌలభ్యం కోసం వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు, మార్పులు చేస్తూనే ఉంటుంది. కాగా.. ఇటీవల ప్రైవసీ పాలసీ విధానం ఎఫెక్ట్ వాట్సాప్ ఫై బాగానే పడింది. చాలా మంది వాట్సాప్ ని అన్ ఇన్ స్టాల్ చేయడం చేశారు. ఆ తర్వాత మళ్లీ ఇన్ స్టాల్ చేయడం కూడా చేశారు.
ఈ నేపథ్యంలో.. వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లను తీసుకువస్తోంది. ఇప్పటికే.. మెసేజ్ లను డిలీట్ చేసేందుకు ‘ వ్యూవన్స్’ అనే ఫీచర్ ను అందుబాటులోకి తెస్తుండగా.. దీనితో పాటే.. ఫాస్ట్ ప్లే బ్యాక్ అనే ఫీచర్ ని కూడా తీసుకువస్తోంది.
మనం అప్పుడప్పుడూ ఇతరులకు ఫొటో, వీడియో సందేశాలకు బదులుగా వాయిస్ మెస్సేజ్‌లు చేస్తుంటాం. అయితే వాయిస్ మెస్సేజ్‌లు వేగవంతంగా వినడం పూర్తి చేయడానికి సరికొత్త ఫీచర్ వాట్సాప్ ఫాస్ట్ ప్లేబ్యాక్ ఫీచర్ లాంచ్ చేస్తోంది. వాట్సాప్ పేరెంట్ కంపెనీ ఫేస్‌బుక్ వాయిస్ మెస్సేజ్‌లను ఎంకరేజ్ చేయడానికి ఫాస్ట్ ప్లేబ్యాక్ ఫీచర్‌ను ప్రవేశపెడుతోంది.
ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు వాట్సాప్ ఈ సౌకర్యాన్ని తీసుకురానుంది. టెక్ట్స్ మెస్సేజ్‌లతో అధిక సమయం అవుతుందని, వాయిస్ మెస్సేజ్‌లు తీసుకొచ్చింది. దీని ద్వారా త్వరగా అవతలి వ్యక్తి చెప్పే విషయాలు తెలుసుకుని బదులివ్వడం చేస్తుంటారు.
This post was last modified on June 7, 2021 10:10 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…