అత్త, కోడళ్ల మధ్య గొడవలు ఎలా ఉంటాయో మనందరికీ బాగానే తెలుసు. ఒకరినొకరు తిట్టుకోవడాలు.. విమర్శించుకోవడాలు మనం రోజూ చూస్తూనే ఉంటాం. అత్త ఏం చెప్పినా.. కోడలికి నచ్చదు.. కోడలు ఏ పని చేసినా.. అత్త మెచ్చదు. ఇవన్నీ.. సాధారణనంగా అందరు ఇళ్లల్లో ఉండేవే. అయితే.. ఈ అత్తా-కోడళ్లు అంతకు మించి.
కరోనా సోకిన అత్తకు దూరంగా ఉందని.. సదరు అత్తగారు.. కోడలిపై తన శాడిజం చూపించింది. కావాలని కోడలికి కూడా కరోనా సోకేలా చేసింది. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్లలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ యువతికి మూడేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. ఆమె భర్త ఏడు నెలల క్రితం పని నిమిత్తం ఒడిశా వెళ్లాడు. అత్త, కోడలు, ఇద్దరు పిల్లలు ఉంటున్నారు. అయితే.. అనుకోకుండా.. అత్తకు కరోనా పాజటివ్ గా తేలింది.
కరోనా అంటువ్యాధి కావడంతో.. కోడలు ఆమెకు దూరంగా ఉండటం మొదలుపెట్టింది. ఆహారం కూడా దూరంనుంచే పెడుతోంది. పిల్లలను కూడా ఆమె వద్దకు వెళ్లనివ్వడం లేదు. దీంతో.. అత్తగారి ఇగో హర్ట్ అయ్యింది. తాను చచ్చిపోవాలని కోడలు కోరుకుంటోందని భావించింది.
తనకు సోకిన కరోనా కోడలికి కూడా సోకాలని అనుకుంది. అంతే..బలవంతంగా కోడలిని హగ్ చేసుకుంది. రెండు రోజుల్లో ఆమెకు కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని బంధువులకు చెప్పి.. కోడలిని ఇంటి నుంచి గెంటేసింది.
సదరు కోడలు తన సోదరి సహాయంతో పుట్టింటికి చేరింది. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్న ఆమె.. ఇటీవల వీడియో కాల్ ద్వారా రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. వారు ఆమె ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపడుతున్నారు.
డిసెంబరు బాక్సాఫీస్‌కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…
అలియా భట్ ఎలా అన్ని బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తుందో చూసి చాలామందికి ఆశ్చర్యమే. కొత్త ఇల్లు, సినిమాలు, బిజినెస్ పనులు,…
రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా…
శాండల్ వుడ్ హీరో ఉపేంద్ర ఎంత టిపికల్ గా ఆలోచిస్తారో తొంభై దశకంలో సినిమాలు చూసిన వాళ్లకు బాగా తెలుసు.…
ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…