వాట్సాప్ … సోషల్ మీడియాలో అంతర్జాతీయంగా దుమ్మురేపుతున్న యాప్. ఇది వచ్చాక.. అసలు ఇలాంటి సర్వీసు ఒకటి లేకుండా ఇంతకాలం ఎలా బతికాంరా అని అనిపిస్తుంటుంది ఒక్కోసారి. ఒక సమాచారాన్ని టెక్ట్స్, ఫొటో, వీడియో రూపంలో క్షణాల్లో పంపగలిన ఈ మాధ్యమాన్ని ఉపయోగించుకుని ఒక ఇండియన్ స్టార్టప్ కంపెనీ ఒక సంచలన సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. అదే ప్రస్తుతం కలకలం సృష్టిస్తున్న కరోనా మహమ్మారికి చేసుకునే పరీక్ష. ప్రస్తుతం కరోనా నిర్ధారణకు రెండు రకాల పరీక్షలు చేస్తున్నారు. ఒకటి రాపిడ్ మరొకటి ఆర్టీపీసీఆర్. ఆర్టీపీసీఆర్‌లో ఎక్కువ ఖచ్చితత్వం ఉంది. అయితే, ఇందులోని ఓ సమస్యను వాట్సాప్ ద్వారా పరిష్కరించారు.
కరోనా నిర్ధారణ కోసం ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసిన తర్వాత సీటీ స్కానింగ్ చేస్తుంటారు. అయితే, ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చినా కూడా స్కానింగ్‌లో ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ గుర్తించిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరోవైపు సీటీ స్కానింగ్‌తో రేడియేషన్ భయం కూడా ఉంది. ఇక ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలు రోజుల తరబడి ఆలస్యం కావడంతో వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్నవారికి కూడా చికిత్స సకాలంలో అందడం లేదు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీపీసీఆర్, సీటీస్కానింగ్ సదుపాయాలు తక్కువ. వీటన్నింటికీ పరిష్కారంగా ఎక్స్‌రేను ఉపయోగించి కరోనా నిర్ధారణ చేసే సాంకేతికతను బెంగళూరుకు చెందిన ఆర్ట్‌కార్ట్ అనే స్టార్టప్ అభివృద్ధి చేసింది. కృత్రిమ మేధ సాయంతో పనిచేసే ఈ టెక్నాలజీని తయారుచేసిన కంపెనీకి డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం రూ. 230 కోట్ల ఆర్థిక సాయం చేయడం గమనార్హం.
ఈ టెక్నాలజీని ‘ఎక్స్‌రేసేతు’ అని పిలుస్తున్నారు. వైద్యులు ఎక్స్‌రేల ఫొటోలను వాట్సాప్ ద్వారా www. xraysetu.com వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తే 10-15 నిమిషాల్లో ఫలితం తెలుస్తుంది. ఇది కొవిడ్‌తో పాటు టీబీ, న్యుమోనియా లాంటి 14 రకాల ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లను గుర్తించగలదు. ఇండియాలో 1000 మందికిపైగా కరోనా రోగులపై ఈ పరిశోధనలు నిర్వహించారు.
ఈ పరీక్ష చేసుకునేందుకు అనుసరించాల్సిన విధానం
స్టెప్ 1 – www. xraysetu.com లోకి వెళ్లి ఎక్స్‌రేసేతు బీటా బటన్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్ 2 – వాట్సాప్ చాట్‌బాక్స్ ఓపెన్ అవుతుంది.
స్టెప్ 3 – వైద్యుడు +91 80461638638 నంబర్‌కు వాట్సాప్ చేయాలి.
స్టెప్ 4 – ఎక్స్‌రే సేతు సర్వీస్ అందుబాటులోకి వస్తుంది.
స్టెప్ 5- తర్వాత వైద్యుడు రోగి ఎక్స్‌రేను వాట్సాప్ చేస్తే 10-15 నిమిషాల్లో ఫలితం తెలుస్తుంది.
This post was last modified on June 3, 2021 10:28 am
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…