Trends

వామ్మో… ఆక్సిమీటర్ ద్వారా వేలిముద్రలతో సైబర్ మోసాలు


క‌రోనా స‌మ‌యంలో ఓ వైపు ఈ మ‌హ‌మ్మారి క‌లిగిస్తున్న షాకుల‌కు ఎప్పుడు బ్రేకులు ప‌డుతాయో అని ఆందోళ‌న చెందుతుంటే ఇదే స‌మ‌యంలో చుక్క‌లు చూపించే అంశాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. క‌రోనా స‌మ‌యంలో కొన్ని ప్రైవేటు ఆస్ప‌త్రుల దోపిడికి బ్రేకులు ప‌డ‌ట్లే. దీనికి సైబ‌ర్ మోస‌గాళ్లు కూడా తోడ‌య్యారు. క‌రోనా స‌మ‌యంలో ఎక్కువ‌గా చోటుచేసుకున్న ఆక్సిమీట‌ర్ వినియోగం ద్వారా దోచుకుంటున్నారు. నకిలీ ఆక్సీమీట‌ర్ల ద్వారా మ‌న బ్యాంకు ఖాతాల నుంచి డ‌బ్బు దోచుకుంటున్నారు.

అమాయకుల నుంచి డ‌బ్బు కొల్లగొట్టేందుకు సైబర్‌ నేరగాళ్లు కరోనా కాలాన్ని కూడా వినియోగించుకుంటున్నారు. ఆక్సిమీటర్ల ద్వారా వల విసురుతున్న ఈ నేర‌గాళ్లు తాము తయారుచేస్తున్న ఆక్సిమీటర్లను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. ఈ ఆక్సిమీటర్లలో వారు ఒక కార్డ్‌ రీడర్‌ను అమరుస్తూ మోసాల‌కు పాల్ప‌డుతున్నారు. ఆక్సిమీటర్ వాడిన సమయంలో వినియోగదారులు కచ్చితంగా దానిలో తమ వేలుపెట్టి ఆక్సిజన్‌ స్థాయిని పరీక్షించుకుంటారు. ఆ సమయంలోనే వీరి వేలిముద్రలు అందులోని కార్డ్‌రీడర్లోకి వెళ్లిపోతాయి. అయితే ఇక్క‌డే ఒక ట్విస్టు.

ఈ సైబ‌ర్ మోస‌గాళ్లు విక్రయించే ఆక్సిమీటర్‌ 15 రోజులే పనిచేస్తుంది! దానిని అమ్మే సమయంలోనే.. ‘ఏదైనా సమస్య వస్తే.. ఆక్సిమీటర్‌ను రీప్లేస్‌ చేస్తాం’ అని వారు హామీ ఇస్తారు. ధర ఎక్కువపెట్టి కొనుగోలు చేసిన వినియోగదారుడు అది చెడిపోగానే తిరిగి వీరినే సంప్రదించాల్సి వస్తుంది. ఇలా ఆక్సిమీటర్‌ చెడిపోయిందని ఫోన్‌ చేయగానే వాళ్లు వచ్చి పాతది తీసుకొని కొత్తవి ఇస్తారు. వెనక్కి తీసుకున్న ఆక్సిమీటర్‌లోని కార్డ్‌రీడర్లను వెలికితీసి వాటిలోని మన వేలిముద్రలను సేకరిస్తారు. ఆ తర్వాత డార్క్‌నెట్‌ లేదా ఇతర వ్యక్తుల ద్వారా సిమ్‌ కార్డు డాటాను తీసుకుంటారు. ఆ డాటాలో మన వేలు ముద్రలను బట్టి మన ఫోన్ నంబర్లను సేకరిస్తారు. దీంతోపాటుగా ఆధార్‌ సమాచారం తీసుకుంటారు. వీటి ద్వారా వారికి మన బ్యాంక్‌ ఖాతాల వివరాలు తెలిసిపోతాయి. అలా వారు బ్యాంక్‌ ఖాతాలను జల్లెడ పట్టి వాటి ద్వారా డబ్బును దోచేందుకు కుట్రలు పన్నుతుంటారు. ఇలా ఆన్‌లైన్‌లో ఆక్సిమీటర్లు కొనుగోలుచేసిన వారి బ్యాంకు ఖాతాలు ఖాళీ అయిన కేసులు ఇటీవల భారీగా నమోదవుతున్నాయని నివేదిక‌లు వ‌స్తున్నాయి. అందుకే బీ కేర్ ఫుల్‌.

This post was last modified on June 3, 2021 9:06 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

1 hour ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

2 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

3 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

3 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

4 hours ago