ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంతలా విజృంభిస్తుందో మనందరికీ తెలిసిందే. ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ఎన్నో రకాల క్లినికల్ ట్రయల్స్ తర్వాత.. కొన్ని వ్యాక్సిన్లకు ప్రభుత్వాలు అనుమతి తెలిపాయి. కాగా.. తాజాగా.. ఓ వ్యాక్సిన్ గురించి షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
అత్యంత నమ్మకమైన వ్యాక్సిన్ గా పేరున్న ఫైజర్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న యువతకు గుండెనొప్పి సమస్యలు వస్తున్నాయంటూ ఓ పరిశోధనలో తేలడం గమనార్హం. ఇప్పటి వరకు ఈ ఫైజర్ వ్యాక్సిన్ ని చాలా మంది తీసుకున్నారు. కాగా.. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కొందరి గుండె పొరల్లో వాపు వచ్చినట్లు గుర్తించామని ఇజ్రాయిల్ పేర్కొంది.
ముఖ్యంగా పురుషుల్లో ఈవాపు లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని, ఇప్పటి వరకు 275మందిలో ఈ లక్షణాలు గుర్తించినట్లు ఇజ్రాయిల్ ఆరోగ్యశాఖ తెలిపింది. ఇజ్రాయిల్ లో 50లక్షల మందికి ఫైజర్ వ్యాక్సిన్ వేశారు. వాపు రావడమే కాకుండా..గుండె సంబంధిత ఇతర సమస్యలు కూడా వస్తున్నట్లు గుర్తించడం గమనార్హం.
అయితే, ఈ వాపు లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని… అలాంటి వారు నాలుగు రోజులకు మించి ఆసుపత్రుల్లో లేరని ఇజ్రాయిల్ తెలిపింది. రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్న 16-30ఏళ్ల మధ్య వయసు వారిలోనే ఈ లక్షణాలు కనిపించాయని ఇజ్రాయిల్ తెలిపింది.
అయితే, తమకు ఈ గుండె సంబంధిత సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్లు సమాచారం లేదని ఫైజర్ తెలిపింది. ఎంఆర్ఎన్ఏ వైరస్ కు, గుండె సంబంధిత వ్యాధులకు మధ్య ఎదైనా లింకుందా అన్న కోణంలో వ్యాక్సిన్ సెఫ్టీ డిపార్ట్మెంట్ పనిచేస్తుందని ఫైజర్ తెలిపింది. ఈ అంశంలో మరింత లోతైన అధ్యయనం చేయాలని ఫైజర్ కు అమెరికా అంటు వ్యాధుల నిరోధక సంస్థ కూడా సూచించింది.
This post was last modified on June 3, 2021 8:35 am
నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమమ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడు. ఆ…
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…
హీరో హీరోయిన్లకు.. పెద్ద టెక్నీషియన్లకు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోషకాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్లకు…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…
మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…