ఒకవైపేమో అందరికీ తొందరగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని నరేంద్రమోడి ప్రకటించారు. మరోవైపు రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సిన టీకాలను కేంద్రం తగ్గించేస్తోంది. ఒకవైపే వ్యాక్సినేషన్ కార్యక్రమాలను పెంచాలని చెబుతునే మరోవైపు టీకాలను తగ్గించేయటం నరేంద్రమోడి సర్కార్ కే చెల్లింది. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత మొదలైన దగ్గర నుండి మోడి డబల్ గేమ్ స్పష్టంగా బయటపడిపోతోంది. మేనెలలో రెండు విడతలు, జూన్ మొదటి విడతలో మొత్తం మీద 50 లక్షల డోసులను కేంద్రం తగ్గించేసింది.
రెండు ఫార్మాకంపెనీల్లో ఉత్పత్తవుతున్న కోవాగ్జిన్, కోవీషీల్డ్ టీకాల్లో 50 శాతం కేంద్రమే సేకరిస్తోంది. మిగిలిన 50 శాతం టీకాలను రాష్ట్రప్రభుత్వాలు, ప్రైవేటు సంస్ధలకు ఫార్మా కంపెనీలు సరఫరా చేస్తోంది. అయితే ఈ సరఫరా కూడా కేంద్రం గైడ్ లైన్స్ ప్రకారమే జరుగుతున్నదిలేండి. కేంద్రం అన్నీ రాష్ట్రాలకు తొలివిడతలో అంటే మేనెల 1-15 మధ్యలో అందించిన డోసులు 2 కోట్ల 12 లక్షల 50 వేలు.
ఇక మే 16-30 మధ్యలో అన్నీ రాష్ట్రాలకు అందించిన రెండో డోసులు 1 కోటి 91 లక్షల 49 వేలు. మూడో డోసు అంటే జూన్ 1-15 మధ్య కేటాయించినవి 1 కోటి 82 లక్షల 30 వేలు. అంటే ఈ డోసులు రాష్ట్రాలకు ఇంకా అందాల్సున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మొదటి విడత కేటాయింపులతో పోల్చితే రెండో విడత డోసులు 21 లక్షలు తగ్గిపోయాయి. అలాగే రెండో విడతతో పోల్చుకుంటే రావాల్సిన మూడో డోసులు 30 లక్షలు తగ్గిపోయాయి.
పై లెక్కలన్నీ కేంద్రప్రభుత్వం ఆరోగ్యశాఖ అధికారికంగా వెబ్ సైట్లో పెట్టినవే. పై లెక్కలను గమనించిన తర్వాత రాష్ట్రాలకు తగ్గించేస్తున్న లక్షలాది డోసుల లెక్కలు స్పష్టంగా అర్ధమవుతున్నాయి. ఒకవైపు లక్షలాది డోసులను తగ్గించేస్తు మరోవైపు వ్యాక్సినేషన్ ముమ్మరంగా చేయాలని ప్రధానమంత్రి పిలుపివ్వటంలో అర్ధమేంటి ? టీకాల విషయంలోనే కాదు ఆక్సిజన్ సరఫరా విషయంలో కూడా కేంద్రం డబల్ గేమ్ అర్ధమైపోతోంది.
This post was last modified on May 20, 2021 9:08 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…