2 డియాక్సీ డి క్లూకోజ్.. షార్ట్‌గా చెప్పాలంటే 2 డీజీ.. ఇప్పుడు అందరి నోళ్లలో నానుతున్న మందు. కరోనా నియంత్రణకు ఈ మందు చాలా ఉపయోగపడుతుందంటూ పెద్ద చర్చే నడుస్తోంది. తాజాగా ఈ మందును కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేయడం.. త్వరలోనే మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండటం తెలిసిన సంగతే. ఈ మందు గురించి జనాలు ఇంటర్నెట్లో తెగ వెతికేస్తున్నారు. వివిధ మార్గాల్లో దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ ఈ మందు కథాకమామిషు ఏంటి.. కరోనా చికిత్సలో దీన్ని ఎలా వినియోగిస్తున్నారు.. ఇది మార్కెట్లోకి ఎప్పుడు వస్తుంది.. దీని గురించి నిపుణుల మాటల్లో తెలుసుకుందాం పదండి.
సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే తెలుగు వైద్య నిపుణుడు డాక్టర్ ఏవీఎస్ రెడ్డి చెబుతున్న దాని ప్రకారం.. 2 డీజీ మందును మొదట రేడియేషన్ ప్రొటెక్షన్ ఏజెంట్‌గా అభివృద్ధి చేశారు. క్యాన్సర్ రోగులకు ఇచ్చే రేడియేషన్ వల్ల కలిగే దుష్పరిమాణాలను నివారించడానికి 30 నిమిషాల ముందు దీన్ని ఇస్తారు. ఈ మందుకు వైరస్‌ను కట్టడి చేసే గుణం ఉందని పరిశోధనల్లో కనుక్కున్నారు. ఈ 2 డీజీ.. వైరస్‌కు కావాల్సిన గ్లూకోజ్‌ను అందకుండా చేసి దాని పునరుత్పత్తిని నివారించడం ద్వారా వైరస్‌ను కట్టడి చేస్తుందని పరిశోధనలో తేలింది. కాబట్టి దీనికి యాంటీ వైరల్, యాంటీ ఇన్‌ఫ్లేమేటరీ గుణాలు ఉన్నట్లు ఒక నిర్ధారణకు వచ్చారు.
కరోనా నియంత్రణకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో మొత్తం మూడు దశలలో కలిపి 330 మంది రోగుల మీద పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల్లో 2 డీజీ ఒక మోస్తరు నుంచి ఎక్కువ తీవ్రత ఉన్న రోగులు ఆక్సిజన్ మీద ఆధారపడటం తగ్గించి త్వరగా ఉపశమనం కలుగజేస్తుందని తేలింది. ఐతే ఈ పరిశోధనా ఫలితాలు ప్రకటించలేదు. వ్యాధి తీవ్రత ఒక మోస్తరు నుంచి అతి తీవ్రంగా ఉండి,ఆక్సిజన్ స్థాయి 94 కన్నా తక్కువ ఉండి ఇంకా ఐసీయూ అవసరం పడని రోగులకు ఈ మందును ఇవ్వమని చెబుతున్నారు. 2డీజీ మందును 45 గ్రాముల పరిమాణంలో ఒక గ్లాస్ నీటిలో కలుపుకుని రోజుకి 2 సార్లు 10 రోజులపాటు ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ప్రస్తుతం 5000 ప్యాకెట్లు తయారు చేసి రక్షణ దళానికి ఇచ్చారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే జూన్ మొదటి వారానికల్లా బహిరంగ మార్కెట్ లో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
This post was last modified on May 18, 2021 9:12 pm
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…
అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…