కోవిడ్ వైరస్ నియంత్రణకు డీఆర్డీవో శ్రమించి డెవలప్ చేసిన 2 డీజీ మందు సోమవారమే విడుదలవుతోంది. కేంద్రమంత్రులు రాజ్ నాధ్ సింగ్, హర్షవర్ధన్ ఢిల్లీలో 2 డీజీ ఔషధాన్ని విడుదల చేస్తున్నారు. కేంద్రమంత్రులు రిలీజ్ చేయగానే సోమవారం 10 వేల పాకెట్లు (సాచెట్లు) మార్కెట్లోకి వస్తున్నాయి. అయితే ఈనెల 27, 28 తేదీల నుండి మరిన్ని సాచెట్లను ప్రతిరోజు మార్కెట్లోకి రిలీజ్ చేసేందుకు డీఆర్డీవో ప్లాన్ చేస్తోంది.
నిజానికి ఈ మందును గతంలో క్యాన్సర్ చికిత్స కోసం అభివృద్ధి చేశారు. అదే ఫార్ములాతో ఇపుడు కరోనా వైరస్ ను నియంత్రించేందుకు ఉపయోగించవచ్చనే ఉద్దేశ్యంతో డెవలప్ చేశారు. శాస్త్రజ్ఞుల పరిశోధనలో మంచి ఫలితాలు వచ్చినట్లు డీఆర్డీవో ఛైర్మన్ సతీష్ రెడ్డి చెప్పారు. జూన్ నుండి పూర్తిస్ధాయిలో సాచెట్లను మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు స్పష్టం చేశారు.
అంటే జూన్ నెలనుండి ఒకవైపు కోవీషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ టీకాలతో పాటు మరోవైపు 2 డీజీ సాచెట్లు కూడా జనాలకు అందుబాటులో రాబోతున్నాయనే అనుకోవాలి. ఒక్కసారిగా టీకాలు, సాచెట్లు అందుబాటులోకి రాబోతున్న కారణంగా కరోనా వైరస్ ను జయించటం జనాలకు పెద్ద కష్టం కాబోదనే అనిపిస్తోంది. ఇదే సమయంలో టీకాలు, సాచెట్ల విషయంలో ప్రభుత్వాలపైన ఒత్తిడి తగ్గటం మంచి పరిణామమే.
దేశంమొత్తం కోవిడ్ పై పోరాడే ఔషధం కోసం ఎదురుచూస్తున్న సమయంలో తాము డెవలప్ చేసిన 2 డీజీ మార్కెట్లోకి రావటం సంతోషంగా ఉందన్నారు సతీష్. తాము నిర్వహించిన 2డీజీ క్లినికల్ ట్రయల్స్ లో ఎలాంటి సైడ్ ఎఫెక్టులు కనిపించలేదని నమ్మకంగా చెప్పారు. మొత్తంమీద కరోనాపై యుద్ధం చేసేందుకు ఎన్ని ఆయుధాలు సమకూరితే జనాలకు అంత మంచిదే కదా.
This post was last modified on May 17, 2021 10:55 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…