మొత్తానికి కరోనా ధాటికి ఐపీఎల్ అర్ధంతరంగా ఆగిపోయింది. మళ్లీ మ్యాచ్‌లు ఎప్పుడుంటాయో తెలియట్లేదు. ఐపీఎల్ వాయిదా పడటమే భారత క్రికెట్ అభిమానులకు రుచించని విషయం అంటే.. దాన్ని మించిన చేదు వార్త ఒకటి వినిపిస్తోంది. ఈ ఏడాది అక్టోబరు-నవంబరు నెలల్లో భారత్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ను ఇక్కడి నుంచి తరలించబోతున్నారన్నదే ఆ వార్త.
గత ఏడాది ఆస్ట్రేలియాలో ఈ టోర్నీ జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా దాన్ని రద్దు చేసి 2022కు వాయిదా వేశారు. ఈ ఏడాది భారత్‌లో జరగాల్సిన తర్వాతి ప్రపంచకప్‌ను యధావిధిగా నిర్వహించాలనుకున్నారు. చివరగా 2016లో పొట్టి కప్పు భారత్ వేదికగానే జరిగింది. ఆ తర్వాత 2018లో జరగాల్సిన టోర్నీ అనివార్య కారణాలతో రద్దయింది. 2020 టోర్నీని వాయిదా వేశారు. 2021 టోర్నీని యధావిధిగా భారత్‌లో నిర్వహించాలనుకున్నారు. ఇలా ఐదేళ్ల విరామం తర్వాత మళ్లీ ఇండియాలోనే టీ20 ప్రపంచకప్ జరగబోతోందని మన అభిమానులు సంతోషించారు.
కానీ ఇప్పుడు చూస్తే భారత్‌లో టోర్నీ జరగడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. టోర్నీకి ఇంకో నాలుగు నెలలే టై ఉంది. ప్రస్తుతం ఇండియాలో కరోనా ఎలా విలయ తాండవం చేస్తోందో తెలిసిందే. ఇంకొన్ని నెలల పాటు కరోనా ప్రభావం పెద్దగా తగ్గేట్లు లేదు. ఐపీఎల్ సజావుగా సాగి ఉంటే ప్రపంచకప్‌ను ఇండియాలో నిర్వహించడంపై ఆశలుండేవి. కానీ ఎన్ని జాగ్రత్తలు పాటించినప్పటికీ.. టోర్నీని మధ్యలో ఆపేయక తప్పట్లేదు.
ఇండియాలో కరోనా మూడో వేవ్ కూడా ఉంటుందన్న నిపుణుల అంచనాల నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌ను ఇక్కడ నిర్వహించే సాహసం ఐసీసీ చేయకపోవచ్చు. ఇక్కడ ఈ టోర్నీ ఆడటానికి విదేశీ జట్లు కూడా అంగీకరించడం అనుమానమే. కాబట్టి గత ఏడాది ఐపీఎల్‌ను విజయవంతంగా నిర్వహించిన యూఏఈలో టీ20 ప్రపంచకప్‌ను జరిపిద్దామని ఐసీసీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశముంది. దీన్ని భారత్ కూడా వ్యతిరేకించకపోవచ్చనే భావిస్తున్నారు.
This post was last modified on May 4, 2021 7:32 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…