ఆయన పేరు నారాయణ్ రావు దబార్కర్. వయసు 85 సంవత్సరాలు. మహారాష్ట్రాలోని నాగపూర్ ఆయన స్వస్థలం. దశాబ్దాల నుంచి ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్)లో పని చేస్తున్నారు. మహారాష్ట్రలో గత ఏడాది నుంచి కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలిసిందే. ఇటీవల అది పతాక స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో నారాయణ్ రావు కూడా వైరస్ బారిన పడ్డారు. ఆయన పరిస్థితి కొంచెం ఇబ్బంది కరంగా మారింది. దీంతో ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం పడింది. ఆయన కుటుంబ సభ్యులు ఎంత కష్టపడ్డా బెడ్ దొరకలేదు.
కొన్ని రోజుల ప్రయత్నం తర్వాత.. నారాయణ్‌కు ఉన్న మంచి పేరు వల్ల ఒక ఆసుపత్రిలో బెడ్ లభించింది. నారాయణ్ రావును హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందిచడం కోసం కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లారు. కానీ అదే సమయానికి ఒక యువకుడు విషమ పరిస్థితిలో కనిపించాడు. అతడికి బెడ్ అత్యవసరం. ఆ యువకుడికి పెళ్లయింది. పక్కనే భార్య కూడా కనిపించింది. నారాయణ్ రావు వాళ్ల పరిస్థితి చూసి కదిలిపోయాడు.
ఈ స్థితిలో మరొకరు ఉంటే.. తమ స్వార్థమే చూసుకుంటారు. ఇంత కష్టపడి బెడ్ సాధించి ఇంకొకరికి ఇవ్వడం ఎందుకు అనుకుంటారు. కానీ నారాయణ్ మాత్రం అలా చేయలేదు. తన వయసు 85 ఏళ్లు అని.. జీవితంలో చూడాల్సిందంతా చూసేశానని.. తన కంటే ఆ కుర్రాడికే బెడ్ అవసరమని అన్నారు. కుటుంబ సభ్యులు వారిస్తున్నా వినకుండా తన కోసం కేటాయించిన బెడ్‌ను ఆ కుర్రాడికి ఇప్పించారు. ఆయన ఇంటికి వెళ్లిపోయారు.
ఇలా వెళ్లిన మూడు రోజులకు నారాయణ్ కరోనాతో పోరాడి ఓడిపోయారు. ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. కానీ ఆయన చేసిన త్యాగం వల్ల ఆసుపత్రిలో ఒక యువకుడి ప్రాణం నిలబడింది. నారాయణ్ రావు చేసిన త్యాగం గురించి కొంత ఆలస్యంగా మీడియాలోకి సమాచారం వచ్చింది. సామాజిక మాధ్యమాల్లో ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
This post was last modified on April 29, 2021 10:02 am
ప్రముఖ ప్రవచన కర్త.. ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం `నైతిక విలువల` సలహాదారుగా నియమించిన విషయం తెలిసిందే.…
మహానటితో గొప్ప పెర్ఫార్మర్ గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చాలా చేసింది…
ప్రస్తుతం దేశమంతా ‘పుష్ప’ కార్చిచ్చు వ్యాపిస్తోన్న సంగతి తెలిసిందే. క్రికెటర్లు మొదలు పొలిటిషియన్ల వరకు ‘పుష్ప’గాడి ఫైర్ కు ఫిదా…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ కొత్త సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో మొదలైన సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్…
అక్కినేని కుటుంబంలో పెళ్లి బాజాలు మ్రోగనున్నాయి. డిసెంబర్ 4 అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా వేసిన సెట్లో ఏఎన్ఆర్ విగ్రహం…
డిసెంబర్ లో పుష్ప 2 సునామి ఉంటుందని తెలిసి కూడా దాని తర్వాత కేవలం రెండు వారాల గ్యాప్ తో…