Trends

డ్రాగన్ ఎంత పనిచేస్తోందో తెలుసా ?

అవసరంలో ఆదుకుంటామని ఒకవైపు ప్రకటనలు ఇస్తోంది. అయితే చేతల్లో మాత్రం భారత్ ను దెబ్బకొట్టాలనే ఆలోచనతోనే పావులు కదుపుతోంది. అంటే ప్రపంచదేశాల దృష్టిలో తాను మంచిదేశమని అనిపించుకోవాలన్న తపనే కనబడుతోంది. కానీ చేతల్లోకి వచ్చేసరికి మనదేశాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అంతా చేస్తోంది. తాజాగా చైనా ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలే ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది.

ఇంతకీ విషయం ఏమిటంటే కరోనా వైరస్ సెకెండ్ వేవ్ కారణంగా మనదేశంలో కరోనా వైరస్ కేసులు, మరణాల సంఖ్య ఎంతలా పెరిగిపోతోందో అందరికీ తెలిసిందే. సోమవారం ఒక్కరోజే 3.5 లక్షల కేసులు నమోదవ్వగా 2875 మంది మరణించారు. మరణాల్లో అవసరానికి సరిపడా ఆక్సిజన్ అందకపోవటమే ప్రధాన కారణమవుతోంది. ఈ కారణంపైనే చైనా పాలకులు భారతదేశం అవసరాలకు తగ్గట్లుగా ఆక్సిజన్ సరఫరా చేస్తామని బ్రహ్మాండమైన ప్రకటనలు ఇచ్చారు. ఆక్సిజన్ పరికరాలను కూడా సరఫరా చేయనున్నట్లు చెప్పారు.

ఒకవైపు సాయం ప్రకటనలు చేసిన ప్రభుత్వం మరోవైపు ఛైనా-భారత్ మధ్య 15 రోజులపాటు కార్గో విమానసర్వీసులను రద్దుచేసింది. దీని కారణంగా చైనా నుండి మనదేశానికి రావాల్సిన ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, మందులు, ఇతర వైద్యపరికరాల సరఫరా నిలిచిపోయింది. ఇదే సమయంలో ఆక్సిజన్, ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల ధరలను 40 శాతం పెంచేసింది.

అలాగే మందులు, ఇతర వైద్యపరికరాలకు సంబంధించిన ముడిసరుకు ధరలను కూడా 20 శాతం పెంచేసింది. చైనా విమాన సర్వీసులను నిలిపేసిన కారణంగా భారత్ కు రావాల్సిన విమానాలన్నీ సింగపూర్ లాంటి దేశాల మీదగానే రావాల్సుంటుంది. దీనివల్ల ఎక్కువ టైం పట్టడమే కాకుండా ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరోనా కాలంలో మనదేశంలో పరిస్ధితులు తెలిసి కూడా కావాలనే చైనా ఎంత ఇబ్బందులు పెట్టాలో అంతా పెడుతోంది. దీంతో డ్రాగన్ అసలు రూపం ఏమిటో మరోసారి ప్రపంచదేశాలకు తెలిసిపోయింది.

This post was last modified on April 27, 2021 11:36 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెండు దశాబ్దాల తర్వాత ఆరు జోడి

ఇటీవలే కంగువ ఇచ్చిన షాక్ నుంచి సూర్య కోలుకున్నాడో లేదో కానీ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేసిన సినిమాని వీలైనంత…

52 mins ago

ప్ర‌జ‌ల‌ను పాత రోజుల్లోకి తీసుకెళ్తున్న చంద్ర‌బాబు!

అదేంటి.. అనుకుంటున్నారా? ప్ర‌పంచం మొత్తం ముందుకు సాగుతుంటే చంద్ర‌బాబు వెన‌క్కి తీసుకువె ళ్లడం ఏంటి? అని విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారా?…

3 hours ago

విశ్వక్సేన్.. ప్రమోషన్ల మాస్టర్

ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసి ప్రేక్షకులకు చేరువ చేయడమే పెద్ద టాస్క్ అయిపోయింది.…

3 hours ago

పోసాని తెలివిగా గుడ్ బై చెప్పేశారు

వైసీపీ హయాంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై సినీ నటుడు,వైసీపీ నేత పోసాని కృష్ణ ముురళి సంచలన వ్యాఖ్యలు చేసిన…

3 hours ago

ఏఆర్ రెహమాన్.. బ్యాడ్ న్యూస్ తరువాత గుడ్ న్యూస్

భారతీయ సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి గాను ఉత్తమ…

3 hours ago