Trends

కొవిడ్‌ వ్యాక్సిన్.. ముక్కులో వేస్తే..?

ఇండియాలో వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలుపెట్టినపుడు.. జనాల నుంచి స్పందన అంతంతమాత్రంగానే కనిపించింది. వ్యాక్సిన్ వేసుకోవడానికి జనాలు రాక టీకా కేంద్రాలు వెలవెలబోయిన పరిస్థితి. కరోనా ప్రభావం తగ్గిపోయిందని, వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం లేదని జనాలు మిన్నకుండిపోయారు. వ్యాక్సిన్ ప్రభావాల మీద కూడా రకరకాల ప్రచారాలు జరగడం ఈ వ్యతిరేకతకు కారణం. కానీ గత కొన్ని వారాల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

కొవిడ్ ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగిపోవడం, ఫస్ట్ వేవ్‌ను మించి ప్రమాదకర పరిస్థితులు రావడంతో ఇప్పుడు అందరిలోనూ భయం పుడుతోంది. వ్యాక్సిన్ కోసం పరుగులు పెడుతున్నారు. టీకా కేంద్రాలు జనాలతో కిటకిటలాడిపోతున్నాయి. కానీ డిమాండ్‌కు సరఫరా టీకాలు లేక ఇబ్బంది ఎదురవుతోంది. విదేశీ వ్యాక్సిన్ల దిగుమతిపై ఆంక్షలు తొలగిపోవడం, దేశీయంగా వివిధ సంస్థలు పెద్ద ఎత్తున కొత్తగా టీకాలు సిద్ధం చేస్తుండటంతో రాబోయే రోజుల్లో పరిస్థితులు మారతాయని ఆశిస్తున్నారు.

ఐతే ఎంత చేసినా ఇలా సూది మందు రూపంలో వ్యాక్సిన్ వేసుకోవడం, శరీరంలో యాంటీ బాడీస్ తయారవడం.. ఇదంతా పెద్ద, సుదీర్ఘ ప్రక్రియ. ఇలా కాకుండా జలుబు ఉన్న వాళ్లు ముక్కులో డ్రాప్స్ వేసుకున్నట్లుగా వ్యాక్సిన్ వేసుకుంటే, వెంటనే వైరస్ చచ్చిపోతే ఎలా ఉంటుంది? ఇప్పుడు కొన్ని ఫార్మాసూటికల్ సంస్థలు ఇవే ప్రయోగాలు చేస్తున్నాయి. దేశంలో పెద్ద ఎత్తున టీకాలు తయారు చేస్తున్న భారత్ బయోటెక్ సంస్థ ఇప్పటికే ఈ దిశగా కీలక ముందడుగు వేసింది.

నాజిల్ స్ప్రే రూపంలో వ్యాక్సిన్‌ను తయారు చేసింది. ట్రయల్స్ కూడా పూర్తయ్యాయి. అనుమతుల కోసం ఎదురు చూస్తున్నారు. దీనికి ఆమోదం లభిస్తే వ్యాక్సినేషన్ చాలా సులభం అయిపోతుందని, సత్వరం వైరస్ నిరోధక శక్తి వస్తుందని అంటున్నారు. కొవిడ్‌పై పోరాటంలో ఇది కీలక ముందడుగు అవుతుందని కూడా నిపుణులు అంటున్నారు. త్వరలోనే భారత్ బయోటెక్ నాజిల్ స్ప్ర్రే వ్యాక్సిన్‌కు అనుమతులు వస్తాయని ఆశిస్తున్నారు.

This post was last modified on April 26, 2021 8:04 am

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

38 minutes ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

2 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

4 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

4 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

4 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

4 hours ago