కరోనా వైరస్ ప్రభావం కరెన్సీ మీద కూడా పడిందా ? అంటే అవునే సమాధానం వినిపిస్తోంది. కరోనా పుణ్యమా అని తొందరలోనే దేశంలో కరోన్సీ చెలామణికి ఇబ్బందులు తప్పేట్లు లేదు. ఎందుకంటే కరెన్సీని ముద్రించే ప్రెస్సులపైన కూడా కరోనా వైరస్ ప్రభావం పడిందట.
మహారాష్ట్రలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ వణికించేస్తున్న విషయం తెలిసిందే. ప్రతిరోజు కొన్ని వేల కేసులు బయటపడుతున్నాయి. అదే స్ధాయిలో చనిపోతున్న వారిసంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతోంది. దీన్ని నియంత్రించేందుకనే ప్రభుత్వం ‘బ్రేక్ ది చైన్’ అనే నినాదాన్ని బలంగా వినిపిస్తోంది.
బ్రేక్ ది చైన్ అంటే అవసరమైతేనే జనాలు రోడ్లపైకి రావాలన్నది అర్ధం. అలాగే జనాలు ఎవరికి వారుగా స్వచ్చంధంగా సామాజిక దూరాన్ని పాటించాలని, వైరస్ నిర్ధారిత పరీక్షలు చేయించుకోవాలని, అవసరమైన వాళ్ళు కరోనా టీకాలు వేయించుకోవాలని ప్రభుత్వం పదే పదేపదే చెబుతోంది. ఈ మొత్తంమీద అవసరం లేకుండా జనాలను రోడ్లపైకి రావద్దన్నది చాలా కీలకం.
ఇందులో భాంగానే నాసిక్ లోని కరెన్సీ సెక్యురిటి ప్రెస్, ఇండియా సెక్యూరిటి ప్రెస్ లో పనిచేసే సిబ్బందికి వైరస్ నిర్ధారిత పరీక్షలు జరిగాయట. ఆ పరీక్షల్లో చాలామందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యిందట. దాంతో రెండు ప్రెస్సుల్లో కరెన్సీ ప్రింటిగ్ ను నిలిపేసి ప్రెస్సులను ఈనెల 30వ తేదీవరకు మూసేశారు. రెండు ప్రెస్సుల్లో 3 వేలమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
ఎప్పుడైతే రెండోచోట్ల కరోన్సీ ప్రింటింగ్ మూసేశారో కొద్దిరోజుల్లో డబ్బుకు కటకట వచ్చే అవకాశాలున్నాయి. ఎలాగంటే దేశంమొత్తం మీద చెలామణి అవుతున్న కరెన్సీ నోట్లలో 40 శాతం నాసిక్ ప్రింటింగ్ ప్రెస్సుల్లోనే ప్రింటవుతాయట. ఒక్కసారిగా 40 శాతం కరెన్సీ ప్రింటింగ్ నిలిచిపోయిందంటే మామూలు విషయంకాదు. మరి దీనికి ప్రత్యామ్నాయంగా కేంద్రం ఏమి చర్యలు తీసుకుంటుందో చూడాల్సిందే.
This post was last modified on April 17, 2021 2:41 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…