ఇప్పటివరకు ఉత్తరాధిని వణికించేస్తున్న కరోనా వైరస్ పడగ తాజాగా బెంగుళూరు మీద పడింది. కరోనా వైరస్ కారణంగా బెంగుళూరు సిటిలో రోజుకు కనీసం వందమంది దాకా చనిపోతున్నట్లు సమాచారం. కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహించేందుకోసమని ప్రభుత్వం ప్రత్యేకంగా 5 శ్మశానవాటికలను ఏర్పాటుచేసింది. అయితే ఇపుడు కరోనా వైరస్ తీవ్రత దెబ్బకు ఇవి ఏమాత్రం సరిపోవటంలేదని సమాచారం.
బెంగళూరులోని జాలహళ్ళి, సుమనహళ్ళి, కెంగేరి, బొమ్మనహళ్ళి, పెనత్తూరు శ్మశానవాటికలను ప్రభుత్వం కరోనా మృతుల అంత్యక్రియల కోసం కేటాయించింది. అంటే సిటి మొత్తంమీద ఎవరు ఎక్కడ కరోనాతో చనిపోయినా పై ఐదు చోట్లకు మాత్రమే తీసుకురావాలి. దాంతో ఆసుపత్రుల నుండి లేదా ఇళ్ళనుండి తీసుకొస్తున్న మృతదేహాలను ఉంచటానికి శ్మశానవాటికల్లో చోటు సరిపోటంలేదు.
లోపల చోటు లేకపోవటంతో డెబ్ బాడీస్ ను పెట్టుకుని జనాలు రోడ్లపైనే వెయిట్ చేయాల్సొస్తోంది. దీంతో చుట్టుపక్కల నివాసాలుండే వాళ్ళకు బాగా ఇబ్బందిగా తయారైంది. ఇదే విషయమై ప్రతిరోజు స్ధానికులు మృతదేహాలను తీసుకొచ్చినవాళ్ళతో గొడవలు పడుతున్నారట. మొన్నటి ఏప్రిల్లోనే సిటిలో కరోనా వైరస్ తో సుమారు 400 మంది చనిపోయారు.
అప్పట్లోనే దహనానికి చాలా ఇబ్బందయ్యింది. అలాంటిది ఇపుడు రోజుకు 100 మంది చనిపోవటమంటే మామూలు విషయంకాదు. దహన సంస్కారాలకు ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లుచేస్తున్నా సరిపోవటంలేదు. ఇదే పరిస్ధితి ఉత్తరాధిలోని ఢిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలో కనిపిస్తోంది. అలాంటిది ఉత్తరాధి పరిస్దితే ఇపుడు ధక్షిణాదిలోని బెంగుళూరులో కూడా మొదలైంది. మరీ పరిస్దితి ఎప్పుడు సద్దుమణుగుతుందో ఏమో.
This post was last modified on April 17, 2021 11:55 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…