ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం!

ఈమధ్యకాలంలో ఎలాంటి ఘోరాలు జరుగుతున్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఒక్క రోజులో కొన్ని వందల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయ్. ప్రయాణించే సమయంలో జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పిన సరే కొందరి నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయ్. ఇక ఈ నేపథ్యంలోనే ఈరోజు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ప్రమాదంలో లారీ కంటైనర్ లో మంటలు తారాస్థాయిలో చెలరేగడంతో క్యాబిన్ లో ఉన్న డ్రైవర్, క్లీనర్ లు సజీవ దహనం అయ్యారు. ఈ లారీ ఆంధ్రప్రదేశ్ నర్సాపూర్ నుండి రోయ్యల లోడుతో వచ్చింది. అయితే ఈ భారీ కంటైనర్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న హిమాయత్ సాగర్ వద్దకు చేరేసమయంలో ప్రమాదానికి చోటుచేసుకుంది.

దింతో ఆ లారీ కంటైనర్ లో మంటలు చెలరేగడంతో సూరజ్, మూర్తునుజన్ అనే డ్రైవర్, క్లీనర్ లు సజీవ దహనం అయ్యారు. ఈ ప్రమాద విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఫైర్ ఇంజన్‌లతో ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. మంటలు అదుపు చేసే లోపే ఇద్దరు సజీవదహనం అయ్యారు.