Trends

అందాల పోటీల వేదికపై ఆమె మాట.. ప్రపంచాన్ని కదిలించింది

అందాల పోటీలు అన్నంతనే వయ్యారాలు ఒలకపోయటం.. కళ్లు చెదిరే అందాల్ని ప్రదర్శించటం.. నవ్వుతూ.. తుళ్లుతూ.. మహా ఉత్సాహభరితంగా సాగే తీరుకు భిన్నంగా సాగిన ఒక పోటీ ఇప్పుడుహాట్ టాపిక్ గా మారింది. ఇందుకు థాయిలాండ్ వేదికగా మారింది. ఇటీవల కాలంలో ఒక బ్యూటీ కాంటెస్టు లో పాల్గొన్న కంటెస్టెంట్ చేసిన వ్యాఖ్యలు.. ప్రపంచ దేశాలు ఆమె వైపు చూసేలా చేయటమే కాదు.. ఆమె దేశంలో జరుగుతున్న దారుణాన్ని కళ్లకు కట్టేలా చెప్పి.. కళ్లు చెమర్చేలా చేసింది.

అమాయకుల్ని ఊచకోత కోస్తున్న మయన్మార్ సైనిక పాలకుల ఆరాచకాల్ని ఆ దేశానికి చెందిన హ్యాన్ లే గళం విప్పారు. అది కూడా.. ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’ పోటీలో. వేదిక మీదకు వచ్చిన ఆమె.. తన హోయల్ని పక్కన పెట్టేసి.. విషాదకర మోముతో మాట్లాడిన మాటలు.. అక్కడి వాతావరణాన్ని మార్చేయటమే కాదు.. ప్రపంచం ఆలోచనలో పడేలా చేసింది. ఈ పోటీలో 63 దేశాలకు చెందిన సుందరీమణులు పోటీ పడగా.. అమెరికాకు చెందిన అందాల భామ అబెనా అపయా విజేతగా నిలిచారు. ఫిలిప్పీన్స్ కు చెందిన సమంతా ఫస్ట్ రన్నరప్ గా నిలిస్తే.. గటెమలాకు చెందిన ఇవానా సెకండ్ రన్నరప్ గా నిలిచారు.

మయన్మార్ కు చెందిన అందాల భామ పోటీలో విజేతగా నిలవకపోవచ్చు. కానీ.. తన మాటలతో అందరిని మనసుల్లో ముద్ర వేశారు. తన దేశాన్ని కాపాడాలని ప్రపంచ దేశాల్ని అభ్యర్థించిన ఆమె మాట.. పోటీ జరిగిపోయిన ఇన్నాళ్లకు కూడా మారుమోగుతూనే ఉన్నాయి. తక్షణం మీ సహాయం కావాలి.. సైనిక పాలకుల కబంధ హస్తాల్లో చిక్కుకున్న తన దేశాన్ని ఆదుకోవాలని ఆమె కోరారు.

ఇరవై రెండేళ్ల చిరుప్రాయంలో చేసిన ఆమె ప్రసంగం అందరిని ఆకట్టుకొంటోంది. ఆమె అందాల పోటీలో పాల్గొన్న రోజునే సైనికుల చేతిలో 141 మంది అమాయకులు బలయ్యారు. పోటీకి కాస్త ముందు ఈ విషయం ఆమెకు తెలియటంతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన ప్రసంగ పాఠాన్ని మార్చుకున్న ఆమె.. తన దేశం వైపు ప్రపంచం చూడాలన్న అభ్యర్థనను చేశారు.

‘ఇక ఆగే సమయం లేదు. వెంటనే సహాయానికి రండి. మయన్మార్ ప్రజలు రోడ్ల మీదకు వచ్చి సైనిక నియంతతోపోరాడుతున్నారు. ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఒక్క దేశమూ సహాయానికి రావటం లేదు. ఒక్కటైతే చెప్పగలను.. మయన్మార్ ప్రజలు ఎప్పటికీ ఆశలు వదులుకోరు. వాళ్లు వీధుల్లోకి వచ్చి పోరాడుతున్నారు. నేనీ వేదిక మీద నుంచి నా నిరసన గళాన్ని వినిపిస్తున్నాను.. నా భావోద్రేకాల్ని నియంత్రించుకుంటున్నా. యావత్ ప్రపంచానికి రెండు నిమిషాల్లో నేను చెప్పాల్సింది చెప్పుకోవాలి. రావటమే ఇక్కడకు అపరాధ భావనతో వచ్చా. ఇక్కడకు వచ్చాక.. ఇక్కడ ఎలా ఉండాలో అలా లేను. అందాల రాణులుచిరునవ్వుతో ఉండాలి. అందరినీ నవ్వుతూ పలకరించాలి. అందరిలో కలుపుగోలుగా ఉండాలి. నేను అలా ఉండలేదు’’ అని ఆమె పేర్కొన్నారు.

ఆమె మాటలకు సభ మొత్తం మౌనంగా మారింది. ఈ అందాల పోటీని నిర్వహించే నిర్వాహకురాలు వేదిక మీదకు వచ్చి.. హ్యాన్ లే ను మనం మయన్మార్ కు పంపలేం.. ఆమెను ఏదో ఒక దేశంలో ఆశ్రయం కల్పించాలని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రపంచానికి రెండు పిలుపులు ఉన్నాయి. అందులో ఒకటి హ్యాన్ లేకు ఆశ్రయం ఇవ్వటం కోసం ముందుకు రావటం.. రెండోది మయన్మార్ ను కాపాడుకోవటం. మరేం జరుగుతుందో చూడాలి.

This post was last modified on April 7, 2021 2:27 pm

Share

Recent Posts

ఏమీ పట్టనట్టు వుంటే ఎలా జగన్?

స్థానిక ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని అధికార కూటమి భావిస్తోంది. వీలైంత వరకు ఎన్నికలు…

10 minutes ago

విజయదశమి క్లాష్… ‘పంచతంత్ర’ పోటీ

ఆదర్శ కుటుంబం తప్పుకుంది. అక్టోబర్ 2 విడుదలైన వాటికి పెద్దగా ఆదరణ దక్కలేదు. సో దసరా పండక్కు వచ్చే సెలవులను…

35 minutes ago

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

11 hours ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

12 hours ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

12 hours ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

12 hours ago