కరోనా నేపథ్యంలో ఈసారి ఇండియన్ ప్రిమియర్ లీగ్ వేదికల్ని ఆరుకు పరిమితం చేయడం.. ఎప్పుడూ ఐపీఎల్ జరిగే హైదరాబాద్, జైపూర్, మొహాలిలను వేదికల జాబితా నుంచి తప్పించడం తెలిసిన సంగతే. ముంబయి, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలతో పాటు అహ్మదాబాద్‌ల్లో మాత్రమే మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.
ఐపీఎల్ మ్యాచ్‌లకు మంచి ఆదరణ ఉండే దేశంలోనే అత్యుత్తమ స్టేడియాల్లో ఒకటైన ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహించకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. కాకపోతే స్టేడియాలకు ఎలాగూ అభిమానులను అనుమతించడం లేదు కాబట్టి ఈ విషయాన్ని మరీ సీరియస్‌గా తీసుకోలేదు ఎవ్వరూ. ఐతే మన స్టేడియంలో ఐపీఎల్ సందడి లేదే అనే అసంతృప్తి మాత్రం ఉంది. కాగా అనూహ్య పరిణామాల మధ్య ఇప్పుడు ఉప్పల్ స్టేడియం ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం ముస్తాబవుతుండటం విశేషం.
ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం సన్నద్ధంగా ఉండాలని బీసీసీఐ నుంచి హైదరాబాద్ క్రికెట్ సంఘం పెద్దలకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఇదంతా ముంబయిలో కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో జరిగిన మార్పు. దేశం మొత్తంలో ఎన్ని కరోనా కేసులు నమోదవుతున్నాయో మహారాష్ట్ర ఒక్క రాష్ట్రంలో ఆ స్థాయిలో కేసులు బయటపడుతున్నాయి. కరోనా ఫస్ట్ వేవ్‌ను మించి ఇప్పుడు అక్కడ ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ స్థితిలో అభిమానులు లేకుండా అయినా ముంబయిలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించడం ప్రమాదమే అని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఇక్కడి హోటళ్లు సహా ఏవీ సురక్షితం కాదన్న ఉద్దేశంలో అవసరమైతే ప్రస్తుతం బయో బబుల్లో ఉన్న ఆటగాళ్లను ప్రత్యేక విమానాల ద్వారా హైదరాబాద్‌కు తరలించి వాంఖడెలో జరగాల్సిన మ్యాచ్‌లు అన్నింటినీ ఉప్పల్ స్టేడియంలో నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోందట. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు కానీ.. బ్యాకప్‌గా ఉప్పల్ స్టేడియాన్ని పెట్టుకుని, ఇక్కడి వాళ్లకు దేనికైనా రెడీగా ఉండాలని సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం.
This post was last modified on April 3, 2021 6:52 pm
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…