వైఎస్ ప్రధాన అనుచరుడు సూరీడిపై హత్యాయత్నం

దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రధాన అనుచరుడు.. ఆయన వెన్నంటే ఉండే సూరీడు మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. జూబ్లీహిల్స్ లో ఉండే అతడిపైన అల్లుడు హత్యాయత్నం చేసిన వైనం కలకలాన్ని రేపింది. గతంలోనూ సూరీడు మీద అతను హత్యాయత్నం చేయటం.. భార్యను వేధింపులకు గురి చేసిన ఆరోపణలు ఉన్నాయి. అతడి మీద గతంలోనే గృహహింస కేసు నమోదైంది.

అయితే.. ఈ కేసును వెనక్కి తీసుకోవటం లేదన్న ఆగ్రహంతో.. సూరీడు మీద క్రికెట్ బ్యాట్ తో దాడి చేసిన వైనం తాజాగా చోటు చేసుకుంది. దీంతో సూరీడు కుమార్తె గంగా భవానీ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో జూబ్లీహిల్స్ పోలీసులు అడిపైన కేసు నమోదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. సూరీడు అల్లుడు సురేంద్రనాథ్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.