ఈ రోజు మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఒక వీడియో అందరినీ కలచివేస్తోంది. తీవ్ర ఆగ్రహానికీ గురి చేస్తోంది. ఆ వీడియోలో హైదరాబాద్ నగర శివార్లలో పోలీసులు ఒక క్యాబ్ డ్రైవర్‌తో వ్యవహరించిన తీరు విస్మయం కలిగిస్తోంది. నడి రోడ్డు మీద పోలీసులు అతడి చుట్టూ చేరి దారుణంగా హింసించారు. ఒక పోలీస్ ఆ వ్యక్తిని చేతులతో కొట్టాడు. కాలితో విచక్షణా రహితంగా తన్నాడు. మరో పోలీస్ లాఠీతో ఆ వ్యక్తిని చితకబాదాడు. మిగతా పోలీసులు ఇదంతా చోద్యం చూసినట్లు చూస్తున్నారు.
వీడియోలో సామాన్య జనం కూడా ఉన్నారు కానీ.. ఎవ్వరూ పోలీసులను వారించే సాహసం చేయలేకపోయారు. పోలీసుల చేతిలో ఇలా చావుదెబ్బలు తిన్న వ్యక్తి పేరు వాజిద్ అట. అతను ఒక క్యాబ్ డ్రైవర్ అని వెల్లడైంది. పోలీసులు ఇంతగా కొట్టడానికి ఆ కుర్రాడు పెద్ద తప్పిదం కూడా ఏమీ చేయలేదని తెలుస్తోంది.
స్థానికుల సమాచారం ప్రకారం సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో హైవే వద్ద పోలీసులు రెగ్యులర్ చెకప్‌లో భాగంగా వాహనాలు ఆపుతుండగా.. వాజిద్ అనే క్యాబ్ డ్రైవర్ ఆగకుండా కొంచెం ముందుకు వెళ్లాడు. కొన్ని మీటర్ల అవతల కారును ఆపాడు. తాము ఆపిన చోట కారు ఆపకుండా ముందుకు వెళ్లిపోవడం పోలీసులకు ఆగ్రహం తెప్పించింది. కారు ఆపాక వాజిద్‌ను బయటికి పిలిచి ఇలా విచక్షణా రహితంగా కొట్టినట్లు తెలుస్తోంది.
పోలీసులు దారుణాతి దారుణంగా ప్రవర్తిస్తున్న దృశ్యాలను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేశారు. దీంతో వారి రాక్షసత్వం బయటికి వచ్చింది. వాజిద్ ఏ తప్పు చేసి ఉన్నా సరే.. రోడ్డు మీద అంత దారుణమైన రీతిలో అతణ్ని కొట్టడం అన్యాయమే. కింద పడి లేవలేని స్థితిలో అతణ్ని చూసి తర్వాత స్థానికులు చలించపోయారు. అక్కడి యువత గుమికూడి వాజిద్‌ను తీసుకుని నిరసనకు దిగారు. పోలీస్ స్టేషన్ దగ్గరికి వాజిద్‌ను మోసుకొచ్చి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వీడియో కూడా ట్విట్టర్లో కనిపిస్తోంది. ఈ సోషల్ మీడియా కాలంలో ఇలాంటి పనులు చేసి పోలీసులు తప్పించుకోవడం తేలిక కాదు. ఈ వ్యవహారం మానవ హక్కుల సంఘం దృష్టికి వెళ్లడం, పోలీసులు ఇరుక్కోవడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on March 23, 2021 3:40 pm
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…
గజ్వేల్ నియోజకవర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట. అయితే.. ఇక్కడే పాగా వేయాలని.. వచ్చే…
తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…