Trends

సచిన్ టెండూల్కరా మజాకా


33 నాటౌట్, 9, 60, 65, 30.. గత రెండు వారాలుగా జరుగుతున్న రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో సచిన్ టెండూల్కర్ స్కోర్లు. ఒక్క మ్యాచ్‌లో మినహాయిస్తే అన్నింట్లోనూ సచిన్ అదరగొట్టాడు. ఇంకో నెల రోజుల్లో 47వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు మాస్టర్ బ్లాస్టర్. కానీ ఈ టోర్నీలో అతడి బ్యాటింగ్ చూస్తే అంత వయసు వచ్చిందంటే నమ్మలేరు. కాంపిటీటివ్ క్రికెట్ వదిలేసి ఏడేళ్లు దాటినా సచిన్‌లో ఇప్పటికీ చేవ తగ్గలేదని.. ఇప్పుడు కుర్రాళ్లతో క్రికెట్ ఆడించినా మినిమం గ్యారెంటీ ఇన్నింగ్స్‌లు ఆడేస్తాడని అనిపిస్తోంది. అంత మంచి టెక్నిక్‌ సచిన్ సొంతం.

క్రికెట్ మేడ్ ఈజీ అన్నట్లుగా అద్భుతమైన టెక్నిక్‌తో కెరీర్ ఆద్యంతం పరుగుల వరద పారించి ఇంకెవ్వరికీ సాధ్యం కాని ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న సచిన్.. రిటైర్మెంట్ తీసుకున్న ఏడేళ్ల తర్వాత కూడా తనలో పరుగుల దాహం తీరలేదని, ఇప్పటికీ తాను రికార్డుల మోత మోగించగలనని రుజువు చేసుకున్నాడు.

రోడ్ సేఫ్టీ సిరీస్‌లో అందరూ రిటైరైన క్రికెటర్లే ఆడిన మాట వాస్తవం. కానీ అందులో సగం మంది గత ఒకట్రెండు ఏళ్లలో రిటైరైన వాళ్లే ఉన్నారు. కొన్ని నెలల ముందు రిటైరైన వాళ్లు సైతం ఇందులో పాల్గొన్నారు. సచిన్ కంటే వయసులో చాలా చిన్నవాళ్లు కూడా చాలామంది ఉన్నారు. కానీ వాళ్లందరినీ వెనక్కి నెట్టి మాస్టర్ ఈ టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలవడం విశేషం.

38 ఏళ్ల వయసులో కుర్రాళ్లందరికీ చెక్ పెడుతూ 2011 ప్రపంచకప్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన ఘనత మాస్టర్ సొంతం. ఇప్పుడు కూడా అదే ఒరవడి కొనసాగిస్తూ మాస్టర్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. తనకు తానే సాటి అనిపించాడు. పరుగుల సంగతలా ఉంచితే.. టోర్నీలో సచిన్ ఆడిన షాట్లు చూస్తే అబ్బురపడకుండా ఉండలేరు. తనదైన శైలిలో స్ట్రెయిట్ డ్రైవ్స్, కవర్ డ్రైవ్స్, స్వీప్ షాట్లు ఆడి ఔరా అనిపించాడు. అతడి షాట్లకు మురిసిపోని అభిమాని లేడు. సచిన్ టెక్నిక్ చూస్తే ఇంకో ఐదేళ్ల తర్వాత కూడా ఇదే జోరు కొనసాగిస్తాడేమో అనిపిస్తోంది. మాస్టర్ ప్రపంచ మేటి బ్యాట్స్‌మన్ ఊరికే అయిపోలేదనడానికి ఇది తాజా రుజువు.

This post was last modified on March 22, 2021 6:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఓటీటీలో మార్కో… ఇంకా ఎక్కువ డోస్

మలయాళంలో గత ఏడాది క్రిస్మస్ సందర్భంగా పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై సెన్సేషనల్ హిట్ అయిన సినిమా ‘మార్కో’. జనతా…

7 hours ago

మూడు కొత్త సినిమాల కబుర్లు…

సోమవారం వసంత పంచమి. చాలా మంచి రోజు. ఈ శుభ సందర్భాన్ని కొత్త సినిమాల ఓపెనింగ్‌ కోసం టాలీవుడ్ బాగానే…

7 hours ago

రానా నాయుడు 2 – భలే టైమింగ్ దొరికిందే

విక్టరీ వెంకటేష్ మొట్టమొదటి వెబ్ సిరీస్ గా 2023 మార్చిలో విడుదలైన రానా నాయుడు భారీ స్థాయిలో మిలియన్ల కొద్దీ…

8 hours ago

ఫస్ట్ ఛాయిస్ అవుతున్న సందీప్ కిషన్

ఊరిపేరు భైరవకోనతో ట్రాక్ లో పడ్డ యూత్ హీరో సందీప్ కిషన్ ఈ నెలలో మజాకాతో పలకరించబోతున్నాడు. త్రినాధరావు నక్కిన…

8 hours ago

మహా ‘ఆనందం’గా ఉన్న బ్రహ్మానందం

లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం ప్రధాన పాత్ర పోషించిన బ్రహ్మ ఆనందం ఫిబ్రవరి 14 విడుదల కానుంది. మాములుగా అయితే విశ్వక్…

8 hours ago

కీర్తి సురేష్ ‘అక్క’ ఆషామాషీగా ఉండదు

బాలీవుడ్ లో బేబీ జాన్ తో అడుగు పెట్టిన కీర్తి సురేష్ కి తొలి సినిమానే డిజాస్టర్ కావడం నిరాశపరిచేదే…

8 hours ago