చుట్టూ ఉన్న వారిని వదిలేసి.. ఏ మాత్రం పరిచయం లేని వారితో స్నేహం చేయటం.. వారితో సాన్నిహిత్యాన్ని కోరుకోవటం లాంటివి విన్నంతనే ఒకలాంటి ఉత్తేజాన్ని ఇస్తాయి. కానీ.. దాని వెనుక మోసం.. నమ్మకద్రోహంతో పాటు.. భారీగా ఇమేజ్ డ్యామేజ్ చేసే ఇబ్బందులు ఉంటాయన్న విషయాన్ని చాలా మంది గుర్తించరు. కానీ.. వారు ఆ విషయాన్ని గుర్తించే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి వెలుగు చూసింది.
హైదరాబాద్ కు చెందిన ఒక వితంతువు.. డేటింగ్ యాప్ లో తన పేరును రిజిస్టర్ చేసుకున్నారు. అందులో రాజ్ అనే వ్యక్తి ఆమెకు పరిచయమయ్యాడు. ఇక్కడ రాజ్ గురించి కాస్త చెప్పాలి. ఇతడు రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు మైనింగ్.. టీ కప్పులు తయారీ పరిశ్రమను నడిపేవాడు. అయితే.. వీటిల్లో నష్టాలు రావటంతో సులువుగా డబ్బులు సంపాదించటం కోసం డేటింగ్ యాప్ లో తన పేరును నమోదు చేసుకున్నాడు.
తనకు పరిచయమైన వారికి తియ్యటి కబుర్లు చెప్పటం.. మాయమాటలతో సినిమా చూపించేయటం చేస్తాడు. సదరు హైదరాబాద్ వితంతువుకు ఇలాంటి బొమ్మనే చూపించిన అతగాడు.. తాను చేసే వ్యాపారానికి డబ్బులు ఇవ్వాలని కోరాడు. త్వరలో పెళ్లి చేసుకుందామన్న మాటతో పాటు.. ఆమె కొడుక్కి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. దీంతో.. అతడ్ని నమ్మిన ఆమె ఇప్పటివరకు రూ.3లక్షలు ఇచ్చింది.
డబ్బులు చేతిలో పడిన వెంటనే.. ఫోన్ బంద్ చేయటంతో తాను మోసపోయినట్లుగా గుర్తించింది. రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రంగంలోకి దిగిన వారు బెంగళూరులో రాజ్ ను అరెస్టు చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. డేటింగ్ యాప్ లు.. ఆన్ లైన్ పరిచయాల్ని ఏ మాత్రం నమ్మకూడదన్న విషయాన్ని తాజా ఉదంతం మరోసారి రుజువు చేసిందని చెప్పాలి.
This post was last modified on March 20, 2021 11:47 am
ప్రధాన మంత్రి నరేంద్రమోడీతో ఉన్న గ్యాప్ను దాదాపు తగ్గించుకునే దిశగా సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా మోడీ…
ఆసీస్-భారత్ టెస్ట్ సిరీస్లో నాలుగో టెస్టు తొలి రోజు ఆటలో విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా ఓపెనర్ సామ్ కాన్స్టాస్ మధ్య…
ఇటీవలే విడుదలైన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ నిర్మాత చెప్పినట్టు పుష్ప 2 గ్రాస్ ని దాటేంత రేంజ్ లో ఆ…
ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకువచ్చిన 'విజన్-2020' - అందరికీ తెలిసిందే. ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దీనికి…
హీరో హిట్లు ఫ్లాపు ట్రాక్ రికార్డు పక్కనపెడితే విజయ్ దేవరకొండ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా…
తెలంగాణ మంత్రి ధరసరి సీతక్క.. ఫైర్.. ఫైర్బ్రాండ్! కొన్ని కొన్ని విషయాల్లో ఆమె చేసిన, చేస్తున్న కామెంట్లు కూడా ఆలోచింపజేస్తున్నాయి.…