షాకింగ్ హత్య ఒకటి వెలుగు చూసింది. హైదరాబాద్ శివారులోని వనస్థలిపురంలో చోటు చేసుకున్న ఈ దారుణం గురించి తెలిసిన వారంతా అవాక్కు అవుతున్నారు. ఇలాంటోళ్లు కూడా ఉంటారా? అని ఆశ్చర్యానికి గురవుతున్నారు. కనిపించకుండా పోయాడనుకున్న వ్యక్తి ఇంట్లోనే హత్యకు గురై.. అదే ఇంట్లోనే పాతి పెట్టేశారన్న దారుణ నిజాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి. అసలేం జరిగిందంటే..
రెండేళ్ల క్రితం మొదటి భార్యకు విడాకులు ఇచ్చేసిన గగన్ అగర్వాల్ అనే వ్యక్తి గత జూన్ లో నౌసిన్ బేగంను పెళ్లి చేసుకున్నారు. అంతా బాగానే ఉందని భావిస్తున్న వేళ.. గత నెల (ఫిబ్రవరి 8న) కనిపించకుండా పోయాడు. అతని గురించి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు దర్యాప్తు జరుపుతున్నారు. తన సోదరుడు మిస్సింగ్ కేసు గురించి గగన్ సోదరుడు పోలీసుల్ని తరచూ వాకబు చేసేవాడు.
విచారణ జరిపిన పోలీసులకు సందేహం వచ్చి ఇంట్లో తనిఖీ నిర్వహించగా.. భర్తను ఇంట్లో చంపేసి పూడ్చి పెట్టేసిన వైనం వెలుగు చూసింది. కట్టుకున్న భర్తను దారుణంగా చంపేయటం ఒక ఎత్తు కాగా.. ఇంట్లోనే పూడ్చేసి ఏమీ తెలియనిదానిలా ఉన్న ఆమె తీరుకు షాక్ తింటున్నారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు. ఈ హత్య వెనుక అసలు కారణం ఏమై ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
This post was last modified on March 10, 2021 7:06 pm
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…