భారత ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా పెళ్లి గురించి కొన్ని రోజులుగా ఎంత చర్చ జరుగుతోందో తెలిసిందే. ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు నుంచి వ్యక్తిగత కారణాలు చెప్పి తప్పుకున్నప్పటి నుంచి అతడి వివాహం గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. అతను పెళ్లి చేసుకోబోతుండటం వాస్తవమే కానీ.. వధువు ఎవరనే విషయంలోనే సస్పెన్స్ నడిచింది. దక్షిణాది సినీ తార అనుపమ పరమేశ్వరన్‌తో బుమ్రా వివాహం అంటూ సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం సాగింది.
ఇంతకుముందే వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నట్లు రూమర్లు వినిపించాయి. కానీ ఎన్నడూ వాళ్లిద్దరూ కలిసి కనిపించిన దాఖలాలే లేవు. ఐతే బుమ్రా పెళ్లి కోసం సెలవు తీసుకున్న సమయంలోనే అనుపమ.. తనకు హాలిడే వచ్చినట్లు, గుజరాత్‌కు వెళ్తున్నట్లు వేర్వేరుగా సోషల్ మీడియా పోస్టులు పెట్టడంతో.. రెంటికీ లింకు కలిపి ఇద్దరి పెళ్లి గురించి ప్రచారాన్ని మరో స్థాయికి తీసుకెళ్లిపోయారు రూమర్ రాయుళ్లు.
ఐతే అనుపమ పెళ్లి గురించి వస్తున్న వార్తలను ఆమె తల్లి ఖండించడంతో ఆ ప్రచారం కొంచెం సద్దుమణిగింది. కానీ బుమ్రా నిజంగా పెళ్లి చేసుకోబోతున్నాడా, ఆ అమ్మాయి ఎవరనే సస్పెన్స్ పెరిగిపోయింది. ఈ విషయంలో ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తోంది. స్పోర్ట్స్ ప్రెజెంటర్ అయిన సంజన గణేశన్ అనే అమ్మాయిని బుమ్రా పెళ్లాడబోతున్నాడట. ఈమె ఐపీఎల్‌లో స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ తరఫున కోల్‌కతా నుంచి పని చేసింది. ఐపీఎల్ కోసం బుమ్రా కోల్‌కతాకు వెళ్లినపుడే ఇద్దరి మధ్య పరిచయం జరిగి.. అది ప్రేమకు దారి తీసినట్లుంది.
వీళ్లిద్దరి పెళ్లి ఈ నెల 14-15 తేదీల మధ్య గోవాలో పరిమిత సంఖ్యలో అతిథుల మధ్య జరగనుందట. ఈ కారణంతోనే బుమ్రా ఇంగ్లాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌కు కూడా దూరమైనట్లు సమాచారం. కర్ణాటక ఆటగాడు స్టువర్ట్ బిన్నీ కూడా టాప్ స్పోర్ట్స్ ప్రెజెంటర్ అయిన మయంతి లాంగర్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. మరో స్పోర్ట్స్ ప్రెజెంటర్ శిబాని దండేకర్.. బాలీవుడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఫర్హాన్ అక్తర్‌తో సెటిలైన సంగతి విదితమే.
This post was last modified on March 9, 2021 2:21 pm
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…