పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఇంకా ప్రొఫెషనల్ క్రికెటర్‌గా కొనసాగుతూనే ఉన్నాడు. ఇంతలోనే అతడి కూతురి పెళ్లి చేసేస్తుండటం విశేషం. అతడికి నలుగురు కూతుళ్లు ఉండగా.. యుక్త వయసుకు వచ్చిన పెద్ద కూతురు అక్సాకు త్వరలోనే పెళ్లి జరగబోతోంది. ఆమెను పెళ్లాడబోయేది ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ జట్టులో ప్రధాన ఫాస్ట్ బౌలర్‌గా ఉన్న షహీన్ షా అఫ్రిది కావడం విశేషం. ఇటీవలే పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో అఫ్రిది.. షహీన్‌తో కలిసి క్రికెట్ ఆడాడు కూడా.
తన సహచర క్రికెటర్‌నే అతను అల్లుడిగా చేసుకోబోతున్నాడు. షహీన్ వయసు 20 ఏళ్లే. రెండేళ్ల నుంచి అతను పాక్ జట్టులో కీలక ఆటగాడిగా ఉంటున్నాడు. అఫ్రిది కూతురితో షహీన్ పెళ్లి అంటూ ముందు జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి. ఒక దశలో ఇది రూమర్ అనే అనుకున్నారంతా.
కానీ ఒక్క రోజు వ్యవధిలో అంతా స్పస్టత వచ్చేసింది. స్వయంగా షహీన్ తండ్రి అయాజే.. తన కొడుక్కి అఫ్రిది కూతురితో పెళ్లి జరగనున్నట్లు వెల్లడించాడు. రెండు నెలలుగా తమ ఇరు కుటుంబాల మధ్య చర్చలు జరుగుతున్నాయని.. తమ విన్నపాన్ని అఫ్రిది కుటుంబం మన్నించి పెళ్లికి అంగీకరించిందని అయాజ్ వెల్లడించాడు. తర్వాత అఫ్రిది సైతం పెళ్లి వార్తను ధ్రువీకరించాడు. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయం అవుతాయని పేర్కొంటూ.. అక్సాకు, షహీన్‌కు త్వరలోనే నిశ్చితార్థం చేయబోతున్నట్లు వెల్లడించాడు.
ఐతే అక్సా, అఫ్రిదిల పెళ్లి మాత్రం ఇప్పుడే ఉండదని తెలుస్తోంది. అక్సా చదువు పూర్తి అయ్యాకే ఆ వేడుక నిర్వహించాలనుకుంటున్నారట. అక్సాకు ఇంకా మైనారిటీ కూడా తీరలేదని అంటున్నారు. అందుకే చదువు పూర్తయి, మైనారిటీ తీరే వరకు వేచి చూసి తర్వాత పెళ్లి చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on March 8, 2021 2:49 pm
ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…
ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ సంబంధాలన్ని అంగడిలో సరుకులుగా మారిపోతున్నాయి. బంధాలు, అనుబంధాలు ఖరీదైన వస్తువులుగా మారిపోయాయి. పాపాయి కంటే రూపాయికే…
ఎల్లుండి విడుదల కాబోతున్న 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' ప్రమోషన్ల ఘట్టం చివరి అంకాన్ని నిన్న దిగ్విజయంగా పూర్తి చేశారు.…
కొంతమంది నాయకుల విషయంలో పార్టీ ముందు.. తర్వాత నాయకులు.. అనే మాట వినిపిస్తుంది. నిజంగా రాజకీయాల్లో కొత్తగా వచ్చినవారు యువతరం…
సైబర్ నేరాల గురించి తరచుగా వార్తలు వస్తున్నాయి. బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ప్రభుత్వాలు సహా రిజర్వ్ బ్యాంకు…
చాలా ఏళ్ల నుంచి తమిళ సినిమాను ఏలుతున్న హీరోల్లో అజిత్ ఒకడు. సూపర్ స్టార్ రజినీకాంత్, దళపతి విజయ్ తర్వాత…