అయ్యో అన్న వేదనకు కలిగించే ఉదంతం అమెరికాలో చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన ఒక అమ్మాయి అమెరికాలో ఐటీ ఎంప్లాయ్ గా పని చేస్తోంది. ఆమె సోదరుడు కూడా అమెరికాలోనే ఉంటున్నారు. త్వరలో పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి.. అనుకోని రీతిలో ఆత్మహత్య చేసుకోవటం విషాదాన్ని నింపింది. ఇంతకూ ఆమె సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే..
చిత్తూరు పట్టణంలోని పోలీసుల కాలనీకి చెందిన సుష్మా అమెరికాలోని డల్లాస్ లో ఉంటున్నారు. ఐటీ ఉద్యోగినిగా ఉన్న ఆమెకు.. తమ జిల్లాలోని పూతలపట్టు ప్రాంతానికి చెందిన భరత్ తో పెళ్లి ఫిక్స్ అయ్యింది. త్వరలో పెళ్లి జరగాల్సిన వేళలో.. అబ్బాయి తరఫు వారు పెళ్లిని కాన్సిల్ చేసుకున్నారు. దీంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన సుష్మా సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
అమెరికాలోనే ఉంటున్న సుష్మ సోదరుడు.. తన చెల్లి ఆత్మహత్య చేసుకున్న వైనాన్ని చిత్తూరులోని తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో.. వారి కుటుంబం శోక సందంలో మునిగింది. త్వరలో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో.. తీరని శోకం చోటు చేసుకోవటం పలువురిని కలిచివేసింది. తమ కుమార్తెకు ఆత్మహత్యకు కారణంగా.. వరుడి కుటుంబమే అంటూ సుష్మ తల్లిదండ్రులు వారిపైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో రెండు రోజుల్లో సుష్మ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
This post was last modified on March 5, 2021 10:31 am
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…