ఆయన అపర కుబేరుడు. ఒక దశలో ఈ హోల్ ప్రపంచం మొత్తం ఆయనను చూసి గర్వించింది. చూసేందుకు పొట్టిగా.. బక్కపలచగా.. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా ఉన్నప్పటికీ.. ఆయన బుర్ర ఐడియాల తొర్ర.. అని! ఆయన వ్యాపార సామ్రాజ్యం.. అనన్యసామాన్యమని.. ప్రపంచం మోసేసింది. ఆయన నుంచి పాఠాలు నేర్చుకుంటామని భారత్ సహా అనేక దేశాలు ప్రకటించి.. తమ తమ దేశాలకు రావాలంటూ.. ఆహ్వానాలు కూడా పంపాయి. అయితే.. ఇప్పుడు ఆయన పరిస్థితి దారుణంగా తయారైంది.! ఇంతకీ ఆయన ఎవరంటే.. అలీబాబా గ్రూప్
అధినేత.. జాక్ మా.. ఆయన అసలు పేరు మా యన్
.
ఒకప్పుడు ఏ రేంజ్‌లో అయితే..ఈ ప్రపంచం జాక్ మా గురించి ప్రసంశలు కురిపించిందో.. ఇప్పుడు అంతే రేంజ్‌లో సింపతీ చూపిస్తోంది. దీనికి కారణం.. ఏంటి? ఎందుకు అంత ఎత్తుకు ఎదిగి ఒక్కసారిగా కుప్పకూలారు? ఇప్పుడు అసలు ఏమైంది? ఇదీ.. మేధావుల నుంచి వ్యాపార దిగ్గజాల వరకు ప్రతి ఒక్కరినీ ఉత్కంఠకు గురి చేస్తున్న ప్రశ్నలు. మరి ఈ విషయం తెలియాలంటే.. ఈ కథనం చదవాల్సిందే!
చైనాకు చెందిన జాక్ మా(56ఏళ్ల వయసు) అత్యంత తక్కువ పెట్టుబడితో అలీబాబా కంపెనీని స్థాపించారు. ఆయన నిరంతర కృషి.. పట్టుదలతో కూడిన లక్ష్యంతో అతి తక్కువ సమయంలోనే ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఈ క్రమంలోనే ఆర్థికంగా ఆయన పుంజుకున్నారు. ఆయన వ్యాపారాలకు అనేక దేశాలు ఫిదా అయ్యాయి. ‘అలీబాబా కథల్లో దాగిన నిధుల్ని వెలికితీ స్తాడు. మేం ఈ-కామర్స్ సామ్రాజ్యంలో ఆ పని చేస్తామన్న అర్థమూ ఉంది’ అంటాడు జాక్. చాలా ఐటీ కంపెనీల మాదిరిగానే అలీబాబా కూడా దాని వ్యవస్థాపకుడి ఇంట్లోనే మొగ్గ తొడిగింది. మిగతా ఈ-కామర్స్ వెబ్‌సైట్ల మాదిరిగా వ్యాపారికీ, వినియోగదారుడికీ మధ్య వారధిగా కాకుండా వ్యాపారికీ-వ్యాపారికీ మధ్య వారధిగా ఏర్పడింది అలీబాబాడాట్‌కామ్.
చైనా వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్‌ను గుర్తించి జాక్ ఈ మార్గాన్ని ఎన్నుకున్నాడు. దుస్తులూ గృహోపకరణాల అమ్మకాలూ కొనుగోళ్లు చేసే సంస్థలకు ఇదో ప్రపంచస్థాయి మార్కెట్. ఆ విధానంతో మూడేళ్లపాటు వేగంగా అభివృద్ధి చెందింది అలీబాబా. ఈ క్రమంలోనే ఆయన చైనా దేశ అగ్ర ఆర్థిక వేత్తల్లో ఒకరుగా ఎదిగారు. అయితే.. అనూహ్యంగా ఆయన ఇప్పుడు కుబేరుడి స్థానం నుంచి దిగజారి పోయారు.. ‘హురున్ గ్లోబల్ రిచ్’ జాబితా ప్రకారం చైనా ధనవంతుల జాబితాలో ఆయన ఏకంగా నాలుగో స్థానానికి పడిపోయారు. మరోవైపు ఆయన వ్యాపార ప్రత్యర్థుల సంపద భారీగా పెరగడం గమనార్హం.
గతేడాది అక్టోబరులో చైనా బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపిన నాటి నుంచి జాక్ మాపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఆయన వ్యాపారాలపై నియంత్రణ సంస్థలతో నిఘా పెట్టింది. ఈ క్రమంలోనే.. 37 బిలియన్ డాలర్ల విలువ చేసే యాంట్ గ్రూప్ ఐపీవోను అడ్డుకుంది. చైనా విడుదల చేసిన టెక్ దిగ్గజాల జాబితా నుండి జాక్ మాను పక్కన పెట్టింది. ఓ సమయంలో జాక్ మా కొన్నాళ్ల పాటు ఎవరికీ కనిపించకుండా పోయారు. దాదాపు రెండు నెలల తర్వాత వర్చువల్ భేటీలో కనిపించారు. ఇక ఇప్పుడు ఆయన చైనా కుబేరుడి స్థానాన్ని కోల్పోయారు.
వాస్తవానికి జాక్ మా, ఆయన కుటుంబం 2019, 2020 ల్లో వరుసగా రెండుసార్లు చైనా కుబేరుల్లో మొదటి స్థానం దక్కించుకుంది. ఈసారి మాత్రం చైనా కుబేరుడిగా ఈ దఫా నాంగ్‌వూ స్ప్రింగ్ కంపెనీ అధినేత జోంగ్ షాన్‌షాన్ నిలిచారు. ఆ తర్వాతి రెండు స్థానాల్లో టెన్సెంట్ హోల్డింగ్స్ పోనీ మా, ఈ కామర్స్ పిన్‌డ్యువోడ్యువో అధినేత కొలిన్ హువాంగ్ నిలిచారు. జోంగ్ ఆదాయం గత సంవత్సర కాలంలో అనూహ్యంగా 85 బిలియన్ డాలర్లకు పెరిగింది. టెన్సెంట్ అధినేత సంపద 70 శాతం ఎగబాకి 74.19 బిలియన్ డాలర్లకు, హువాంగ్ సంపద 283 శాతం ఎగిసి 69.55 బిలియన్ డాలర్లకు చేరుకుంది. జాక్ మా, ఆయన ఫ్యామిలీ సంపద ఏడాది వ్యవధిలో 22 శాతం పెరిగి 55.64 బిలియన్ డాలర్లగా ఉంది.
This post was last modified on March 4, 2021 10:57 am
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…