భారత క్రికెట్లో ఇప్పుడు నంబర్ వన్ ఫాస్ట్ బౌలర్ ఎవరు అంటే మరో మాట లేకుండా జస్‌ప్రీత్ బుమ్రా పేరు చెప్పేయొచ్చు. 27 ఏళ్ల ఈ బరోడా ఫాస్ట్ బౌలర్ ఘనతల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. విచిత్రమైన బౌలింగ్ శైలితో ఐపీఎల్‌లో ముంబయి జట్టు తరఫున మెరుపులు మెరిపించి శరవేగంగా అంతర్జాతీయ స్థాయిలో ఎదిగి.. మూడు ఫార్మాట్లలో భారత జట్టుకు ప్రధాన ఫాస్ట్ బౌలర్‌గా ఎదిగాడీ కుర్రాడు.
మరొక్క రోజులో భారత జట్టు ఇంగ్లాండ్‌తో కీలకమైన నాలుగో టెస్టును ఆరంభించబోతుండగా.. బుమ్రా ఏమో వ్యక్తిగత కారణాలు చెప్పి ఈ మ్యాచ్ నుంచి తప్పుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అతడికి ప్రస్తుతం ఫిట్నెస్ సమస్యలు కూడా ఏమీ లేకున్నా ఇంగ్లాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు సైతం దూరం కాబోతున్నట్లు తెలుస్తోంది. టీ20ల నుంచి ఇప్పటికే తప్పుకున్న అతను వన్డే సిరీస్‌కు కూడా అందుబాటులో ఉండడని అంటున్నారు. ఇందుక్కారణం అతడి పెళ్లి ఖాయం కావడమే అంటున్నారు.
పెళ్లి కోసమే బీసీసీఐ నుంచి సెలవు కోరి బుమ్రా జట్టును వీడాడంటూ గట్టిగా ప్రచారం జరుగుతోంది. నేషనల్ మీడియాలో దీనిపై విస్తృతంగా వార్తలొస్తున్నాయి. అమ్మాయి ఎవరు, పెళ్లి ఎఫ్పుడు అన్న వివరాలు మాత్రం వెల్లడి కాలేదు. బుమ్రాకు ఒక టైంలో సౌత్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌తో ముడి పెట్టి.. వారి మధ్య ఎఫైర్ అంటూ జోరుగా ప్రచారం చేశారు. ఈ మధ్య దాని గురించి చప్పుడు లేదు. ఒకవేళ రూమర్లను నిజం చేస్తూ అనుపమనేమైనా అతను పెళ్లాడి షాకిస్తాడేమో అని సోషల్ మీడియా జనాలు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.
బుమ్రా బరోడా వాసి అయినప్పటికీ.. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ బౌలర్‌గా అతను వెలుగులోకి వచ్చాడు. విచిత్రమైన బౌలింగ్ శైలితో ఆడిన తొలి సీజన్లోనే బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాడతను. ఐతే ఈ శైలితో ఎంతో కాలం మనలేడని.. వన్డేలు, టీ20ల్లో ఇతను పెద్దగా ప్రభావం చూపలేడని తీసిపడేశారు విశ్లేషకులు. కానీ ఆ శైలితోనే అతను అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. టీ20ల్లోనే కాక వన్డేలు, టెస్టుల్లోనూ అదరగొట్టాడు. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు.
This post was last modified on March 3, 2021 10:34 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…