ప్రతి ఏడాదీ వేసవి వచ్చిందంటే క్రికెట్ అభిమానులందరి చూపూ ఐపీఎల్ మీదే ఉంటుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఆ సమయంలో ఎక్కడ చూసినా ఐపీఎల్ సందడే కనిపిస్తుంది. క్రికెట్ అభిమానులు స్టేడియాలకు వెళ్లి మ్యాచ్‌లు చూడాలని ఆశపడతారు. దేశంలో ఐపీఎల్‌తో హోరెత్తిపోయే నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటి. ఇక్కడ సన్‌రైజర్స్ జట్టుకు తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. ఐతే గత ఏడాది కరోనా కారణంగా ఇండియాలో ఐపీఎల్ జరగలేదు. చాలా ఆలస్యంగా జరిగిన టోర్నీకి యూఏఈ ఆతిథ్యమిచ్చింది.
ఐతే పెద్దగా గ్యాప్ లేకుండా ఐపీఎల్ కొత్త సీజన్ వచ్చేయడంతో అభిమానులు హుషారుగా ఉన్నారు. ఏప్రిల్ రెండో వారంలో మొదలయ్యే ఐపీఎల్‌ను స్టేడియాలకు వెళ్లి చూడాలని ఆశపడుతున్న హైదరాబాదీలకు బీసీసీఐ షాకివ్వబోతున్నట్లు సమాచారం. ఈసారి హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు ఉండవట.
కరోనా నేపథ్యంలో ఒకప్పట్లా ఎనిమిది అంతకంటే ఎక్కువ వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహించకూడదని బీసీసీఐ తీర్మానించినట్లు తెలుస్తోంది. వేదికల్ని ఆరుకు పరిమితం చేయనున్నారట. ప్రస్తుతానికి ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, అహ్మదాబాద్‌లను ఖరారు చేశారు. మహరాష్ట్రాలో కరోనా రెండో వేవ్ నేపథ్యంలో ముంబయిని ఎంపిక చేసే విషయంలో కొంత తర్జన భర్జనలు నడుస్తున్నాయి. ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఓకే అంటే అక్కడా ఐపీఎల్ జరుగుతుంది. ఎప్పుడూ ఐపీఎల్‌కు ఆతిథ్యమిచ్చే హైదరాబాద్, జైపూర్, మొహాలిలను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
దక్షిణాదిన బెంగళూరు, చెన్నైలకు అవకాశం కల్పించి హైదరాబాద్‌ను మాత్రం విస్మరించడం అన్యాయమే. ఐతే హైదరాబాదీ ఆటగాళ్లను సన్‌రైజర్స్ జట్టు ఎంచుకోకపోవడంపై ఆగ్రహిస్తూ ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్.. ఐపీఎల్ మ్యాచ్‌లను అడ్డుకుంటామన్న హెచ్చరికలు ప్రతికూల ప్రభావం చూపాయేమో తెలియదు. అంతకు మించి ప్రధాని నరేంద్ర మోడీ సొంత నగరం అహ్మదాబాద్‌లో ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంగా అవతరించిన మొతేరాకు మ్యాచ్‌లు కేటాయించడం కోసం హైదరాబాద్‌ను తప్పించి ఉండొచ్చని కూడా భావిస్తున్నారు. అహ్మదాబాద్ కేంద్రంగా ఐపీఎల్ ఫ్రాంచైజీ లేకపోయినా.. ఇక్కడ ఫ్రాంఛైజీ ఉన్న హైదరాబాద్‌కు అన్యాయం చేయడమేంటో?
This post was last modified on February 28, 2021 3:52 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…