ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. కానీ ఇది సంతోషించాల్సిన రోజేమీ కాదు. దేశంలో కొన్ని నెలలుగా శరవేగంగా పెరుగుతున్న పెట్రోలు ధర.. ఇప్పుడు కొన్ని నగరాల్లో ఏకంగా రూ.100 మార్కును టచ్ చేసింది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ పెట్రోలు, డీజిలు ధరలు పెరగడం మామూలే కానీ.. మోడీ సర్కారు హయాంలో, ముఖ్యంగా రెండోసారి అధికారంలోకి వచ్చాక అసాధారణంగా రేట్లు పెరుగుతూ వచ్చాయి. గత రెండు నెలల్లోనే అసాధారణంగా ధరలు పెరిగి పెట్రోల్ ధర రూ.100 దాటిపోయింది.
పెట్రోల్ ధర సెంచరీ కొట్టడం ముందు నుంచి ఊహిస్తున్నదే. ఈ నేపథ్యంలో ఆ సందర్భం వచ్చినపుడు వినియోగదారులు బండి ఆపి హెల్మెట్ తీసి ఆకాశంలోకి చూస్తూ అభివాదం చేయాలని, సెంచరీ చేసినపుడు క్రికెటర్లు ఇలాగే చేస్తారని ఒక జోక్ కొన్ని రోజుల కిందట హల్‌చల్ చేసింది. ఇప్పుడు ఆ సందర్భం వచ్చేసరికి కొందరు నిజంగా అలాగే చేసి ప్రభుత్వం మీద సెటైర్లు వేస్తున్నారు. ఈ సెంచరీ మీద ఇలాంటి జోకులు మరెన్నో పేలుతున్నాయి. కాగా ఒకప్పుడు భారత జట్టుకు కూడా ఆడిన పశ్చిమ బెంగాల్ క్రికెటర్ మనోజ్ తివారి క్రికెట్ భాషలో పెట్రోల్ సెంచరీ మీద వేసిన ఒక కౌంటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
Wat an innings by Petrol so far. A well-compiled century on dis difficult situation. U looked 4 a big one d moment u played ur first ball. Equally supported by Diesel. Great partnership by u 2. Wasn’t easy playing against d common people but u both did it… ఇదీ మనోజ్ తివారి వేసిన ట్వీట్. అచ్చంగా క్రికెట్ భాషలో పెట్రోల్ సెంచరీ గురించి సెటైర్ వేశాడు మనోజ్.
క్రికెట్ కామెంట్రీ ఫాలో అయ్యే వాళ్లకు ఇది భలేగా కనెక్ట్ అవుతుందనడంలో సందేహం లేదు. బెంగాల్ మమతా బెనర్జీ సర్కారుకు మనోజ్ మద్దతుదారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతనిలా కౌంటర్ వేశాడు. ఈ ట్వీట్ వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో.
This post was last modified on February 18, 2021 10:26 pm
ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…