Trends

కొత్త రికార్డు: జూబ్లీహిల్స్ లో రికార్డు ధరకు భూమి అమ్మకం

హైదరాబాద్ మహానగరంలో సరికొత్త రికార్డు నమోదైంది. ఇప్పటివరకు పలికిన ధరలకు భిన్నంగా సంపన్నులు నివాసం ఉండే జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఒక ఇంటి స్థలాన్ని రికార్డు ధరకు కొనుగోలు చేసిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఫార్మా కంపెనీ అధినేత ఒకరు భారీ మొత్తాన్ని వెచ్చింది ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. 1837 చదరపు గజాల కోసం ఏకంగా రూ.41.3 కోట్ల మొత్తాన్ని వెచ్చించిన వైనం ఇప్పుడు సరికొత్త రికార్డుగా చెబుతున్నారు.

ఈ ప్రాంతంలో ఒక ఇంటి స్థలానికి ఇంత పెద్ద మొత్తంలో లావాదేవీ జరపటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. ఈ లావాదేవీ కోసం రిజిస్ట్రేషన్ శాఖకు ప్రభుత్వం చెల్లించిన స్టాంపు డ్యూటీ భారీగా ఉందంటున్నారు. అధికారిక లెక్కల ప్రకారం బయటకు వచ్చిన అనధికారిక సమాచరం ఏమంటే.. 1837 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవటం కోసం ప్రభుత్వానికి చెల్లించిన స్టాంపు డ్యూటీనే రూ.2.27 కోట్లుగా చెబుతున్నారు. దీనికి అదనంగా మరో రూ.20లక్షల మొత్తాన్ని రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించారు.

జనవరి 28న జరిగిన ఈ లావాదేవీకి సంబంధించిన వివరాలు కాస్త ఆలస్యంగా.. తాజాగా బయటకు వచ్చాయి. ఒక ఫార్మా కంపెనీ అధినేత ఈ భారీ మొత్తానికి స్థలాన్ని కొనుగోలు చేసినట్లుగా చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. తాజా లావాదేవీ ప్రకారం జూబ్లీహిల్స్ లో గజం భూమి విలువ రూ.2.2లక్షలుగా తేలింది. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో గజం భూమి విలువ రూ.1.5 లక్షల నుంచి రూ.2లక్షల వరకు పలుకుతోందని..

తాజా లావాదేవీతో కొత్త రికార్డు నమోదైనట్లుగా చెబుతున్నారు. అయితే.. ఇదేమీ అసాధారణం ఏమీ కాదన్న మాట వినిపిస్తున్నా.. కరోనా తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎంత దూకుడుగా ఉందన్న విషయం తాజా లావాదేవీ స్పష్టం చేస్తుందని చెప్పక తప్పదు. ఇదిలా ఉంటే.. అధికారికంగానే ఇంత ఉంటే.. అనధికారికంగా మరికొంత ధర ఉండి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

This post was last modified on February 14, 2021 11:14 am

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

1 hour ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

3 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

3 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

5 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

6 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

7 hours ago