Trends

పెళ్లి కోసం తపించిపోయేవాళ్ళు ఇంతమంది ఉన్నారా?

నాకు పెళ్ళెప్పుడవుతుంది బాబూ … పిల్ల యాడ దొరుకుతుంది బాబోయ్ అనే సినిమా పాట పాడుకుంటున్నారు కేరళం యువకులు. అత్యధిక విద్యావంతులు కలిగివున్న కేరళం రాష్ట్రంలో పెళ్లికాని యువతీ యువకుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. చదువు, ఉద్యగం, కేరీర్ అంటూ సరైన వయసులో పెళ్లి చేసుకోక పోవడంతో లేటు వయసులో సంబంధాలు దొరకడం కష్టమై పోతోంది. ఇది కేరళంలో సామాజిక సమస్యగా మారుతోంది. ఇటీవల ఒక కమిటీ నిర్వహించిన ఉచిత పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ క్యాంప్ కు వేలాది మంది తరలి రావడం ట్రేండింగ్ అయ్యింది.

వయసు పెరిగిపోతున్నా సంబంధాలు రాకపోయిన వారికోసం కోజీకోడ్ జిల్లా కరంతుర్ లోని హరహర మహాదేవ క్షేత్ర కమిటీ ఆదివారం ఉచిత వివాహ రిజిస్ట్రేషన్ క్యాంప్‌ను ఏర్పాటు చేసింది. దీనికి 1,500 నుండి 2,000 మంది వరకు వస్తారని అంచనా వేసిన నిర్వాహకులు దానికి సరిపడా దరఖాస్తు ఫారమ్‌లను సిద్ధం చేశారు. అయితే ఉదయం 8 గంటలకే 7 వేల మందికి పైగా యువతీ యువకులు, వారి తలిదండ్రులు క్యూలో నిల్చోవడం చూసి ఆశ్చర్య పోయారు. క్యూ లైన్ ఆలయ ప్రాంగణాన్ని దాటి నేషనల్ హైవేపై రెండు బస్ స్టాప్‌ల దూరం వరకు సాగింది. దీంతో యువకులను కంట్రోల్ చేసేందుకు ట్రాఫిక్‌ పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.

కుప్పలు కుప్పలుగా తరలి వచ్చిన బ్రహ్మచారులు, అమ్మాయిల దెబ్బకు నిముషాల వ్యవధిలోనే దరఖాస్తులు అయిపోయాయి. దాంతో ఏమి చేయాలో దిక్కు తోచని నిర్వాహకులు కొత్త అప్లికేషన్లను సిద్ధం చేయడానికి టైం సరిపోక ఫోటో స్టాట్ కాపీలు అందజేశారు. అయినప్పటికీ అప్లికేషన్లు చాలక పోవడంతో అప్పటికప్పుడు 4 వేల దరఖాస్తులు ప్రింటింగ్ చేయించారు. పూర్తి చేసిన దరఖాస్తులు స్వీకరించేందుకు అక్కడ వున్న సిబ్బంది ఇబ్బంది పడ్డారు. ఈ బ్రహ్మచారుల గుంపు గురించి పట్టణంలో తెలిసే సరికి వారిని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలి వచ్చారు. దాంతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది.

అయితే ఈ రిజిస్ట్రేషన్ క్యాంపుకు వచ్చిన వారిలో 30 నుంచి 40 ఏళ్ళ వయసు కలిగిన లేట్ మ్యారేజ్ యువకులు 80 శాతానికి పైగానే వున్నారట. దీనికి కారణాలు ఏమిటాని పరిశోదించే పనిలో పడ్డారు కొందరు. డబ్బు సంపాదించి కుటుంబాన్ని పోషించే బాధ్యత పూర్వం రోజుల్లో పురుషుల మీద వుండేది. మహిళలు ఇంటిని చక్కదిద్దేందుకు తమ సమయాన్ని కేటాయించేవారు. ఇప్పుడు రోజులు మారాయి… ఇద్దరూ చదువుకుంటున్నారు. ఇద్దరూ సంపాదించడానికి మొగ్గు చూపుతున్నారు. దాంతో పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటున్నట్లు అంచనా వేస్తున్నారు.

అంతేకాకుండా… అక్షరాస్యతా శాతం ఎక్కువగా వున్నప్పటికి మూఢ నమ్మకాలు కూడా కేరళంలో అంతే స్థాయిలో వున్నట్లు తెలుస్తోంది. దీంతో అనేకమంది యువతీ యువకులు జాతకాలు, జ్యోతిశ్యాన్ని నమ్ముతున్నారు. జాతక దోషాల పేరిట పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటున్నారు. దీంతో పెళ్లి ఆలస్యమై బ్రహ్మచారులుగా మిగులుతున్నారని సామాజికవేత్తలు చెబుతున్నారు. మూఢనమ్మకాలు, జాతకాల పట్టింపుల వల్లే తమ జీవితాలు నాశనం అవుతున్నాయని కొందరు యువకులు ఆవేదన వ్యక్తం చేయడం విశేషం.

This post was last modified on November 2, 2026 10:40 pm

Share

Recent Posts

రష్మిక తాండవం ఊహించలేదు

ర‌ష్మిక మంద‌న్నా కెరీర్లో ఎక్కువ‌గా స్టార్ హీరోల స‌ర‌స‌న క‌థానాయిక‌గానే న‌టించింది. ఈ మ‌ధ్యే ఆమె కూడా లేడీ ఓరియెంటెడ్…

36 minutes ago

హైదరాబాద్ గడ్డపై విరుచుకుపడ్డ అమిత్ షా

తెలంగాణ‌లో ప‌ర్య‌టన‌కు వ‌చ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్ర‌నాయ‌కుడు అమిత్‌షా.. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కీల‌క…

42 minutes ago

ఏపీలో మునిసిప‌ల్ పోలింగ్ ఎందుకు త‌గ్గింది… రీజ‌నేంటి?

ఏ ఇద్ద‌రు నేత‌లు క‌లిసినా.. ఏ ఇద్ద‌రు నాయ‌కులు ఫోన్లు చేసుకున్నా.. ఇదే అంశంపై చ‌ర్చ సాగుతోంది. ఏపీలో తాజాగా…

50 minutes ago

అమ్మా… నాన్న…. ఓ బుడ్డోడు

సంతానం లేని ఆ దంపతులు తల్లి చనిపోయిన పసి బిడ్డను దత్తత తీసుకొని గుండెలకు హత్తుకున్నారు. ఆలానా పాలనా చూస్తూ…

1 hour ago

రెండు నెల‌ల వ‌రకు టీటీడీ బోర్డు లేన‌ట్టే..

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత తిరుమల తిరుప‌తి దేవ‌స్థానం(టీటీడీ) పాల‌క మండ‌లి కాల ప‌రిమితి తీరిపోయిన నేప‌థ్యంలో కొత్త‌గా పాల‌క మండ‌లిని ఏర్పాటు…

1 hour ago

చరణ్, సుకుమార్ సినిమా… సిల్లీ డిస్కషన్లు

తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న రిపీట్ కాంబో ఎట్టకేలకు రంగంలోకి దిగింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,…

2 hours ago