ఈ రోజుల్లో పౌరాణిక చిత్రాలు తీయడం అంటే అంత తేలికైన విషయం కాదు. టెక్నాలజీ అందుబాటులో ఉండడం వల్ల విజువల్స్‌తో మాయాజాలం చేయొచ్చు కానీ.. ఆ కథలకు పకడ్బందీగా రచన చేసి, తెరపైకి తేవడం టెక్నీషియన్లకు సవాలు కాగా.. పురాణ పాత్రలను పండించడం నటీనటులకు ఛాలెంజ్. ముఖ్యంగా ఈ సినిమాలకు మాటలు రాయడం కష్టమైన విద్యే. ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘రామాయణం’ సినిమాకు తెలుగులో మాటలు రాసిందెవరు అన్నది ఆసక్తికరం. ఆ పని చేసింది ఆకెళ్ళ శివప్రసాద్.
ఈ పేరు విన్నట్లుంది కదా? ఆయన లెజెండరీ డైరెక్టర్ కృష్ణవంశీ రూపొందించిన ‘రంగమార్తాండ’కు డైలాగ్స్ రాశారు. అలాగే మంచు విష్ణు ప్రధాన పాత్రలో రూపొందిన ‘కన్నప్ప’కు సంభాషణలు అందించింది కూడా శివప్రసాదే. ఈ సినిమాల్లో చూపించిన ప్రతిభే.. వేల కోట్ల ప్రాజెక్టు అయిన ‘రామాయణం’కు తెలుగులో మాటలు రాసే అవకాశం తెచ్చిందాయనకు. ఈ అరుదైన అవకాశం దక్కడం, రామాయణంకు డైలాగ్స్ రాసిన అనుభవం గురించి ఆకెళ్ళ శివప్రసాద్ మాట్లాడారు.
‘‘రామాయణం సినిమాకు డైలాగులు రాయాలని దాని మేకర్స్ గోశాల రాంబాబు అనే లిరిసిస్టును అడిగారు. ఆయన ‘కాంతార’కు తెలుగు పాటలు రాశారు. కానీ ఆయనేమో నన్ను రెఫర్ చేశారు. ముందుగా రామాయణం మేకర్స్ రెండు హిందీ సన్నివేశాలను నాకు పంపించారు. అందులో మొదటిది కైకేయి కోప గృహంలోకి వెళ్లే సీన్, రెండోది శూర్పనఖ ముక్కు, చెవులను లక్ష్మణుడు కోసే ఘట్టం. వాటికి వెంటనే తెలుగులో మాటలు రాసి పంపాను. నాలుగు రోజుల తర్వాత తెలుగు డైలాగులు బాగున్నాయని వెబ్ మీటింగ్ నిర్వహించారు. దర్శకుడు నితీశ్ తివారి తెలుగు పదాలు బాగున్నాయని చెప్పడంతో అగ్రిమెంట్ చేసుకున్నాం.
హిందీ సినిమా చూడ్డానికి ముంబయి పిలిచారు. అనేక దశల్లో సినిమా చూపించారు. అక్కడ అన్ని భాషల రచయితలు ఎవరి డైలాగులు వాళ్లు చదివేవారు. ఏ భాషలో డైలాగ్ బాగుంటే.. దాన్ని మిగిలిన వాళ్లు పాటించమనేవారు. తెలుగు డైలాగులు చాలా వాటికి బాగున్నాయని పేరొచ్చింది. హిందీ డైలాగ్స్‌ను అర్థం చేసుకుంటూ అందరం చర్చించుకుంటూ పని పూర్తి చేశాం. ప్రతి మాటనూ తెలుగులోకి మక్కీకి మక్కీ దించకుండా డైలాగులు రాశాను. లిప్ సింక్‌లో తేడా రాకుండా అచ్చంగా తెలుగులో మాట్లాడుతున్నట్లు అనిపించేలా పదాలను కూర్చాను.
ఈ సినిమాకు డబ్బింగ్ చెబుతూ రాజేష్ మూర్తి తెలుగు డైలాగులను మెచ్చుకున్నారు.
సీత పాత్ర చేసిన సాయిపల్లవి తమిళ డబ్బింగ్‌కు ఒకటిన్నర రోజు తీసుకుంటే.. తెలుగులో మాత్రం చాలా ఈజీగా ఉందంటూ ఆరు గంటల్లో డబ్బింగ్ పూర్తి చేశారు. ‘రామాయణం’లో ప్రతి సీన్ అద్భుతమే. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగుంటాయి. అయోధ్య వైభవాన్ని, స్వర్ణ లంక ప్రాభవాన్ని గొప్పగా చూపించారు. పాతాళ లోకాన్ని, అరణ్యాలను సహజ సిద్ధంగా ఆవిష్కరించారు. రాముడు వనవాసానికి వెళ్తున్నపుడు ఆయన రథానికి ఉన్న 14 ఇరుసులను చూపించడం గొప్పగా అనిపిస్తుంది. దాదాపు ఎనిమిదేళ్లు శ్రమించి ఈ సినిమాను రూపొందించారు’’ అని శివప్రసాద్ వివరించారు.
This post was last modified on November 4, 2026 12:35 am
అధికారంలో ఉన్నవారిపై విమర్శలు చేసినందుకు కేసులు పెట్టడం, అరెస్టులకు సిద్ధపడటం వంటి వ్యవహారాలపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.…
ఐపీఎల్ 2027 కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్‌ను బలోపేతం చేసుకునే పనిలో పడింది. ఇప్పటికే నటరాజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి…
కొన్ని రోజుల ముందు వరకు శ్రీలీల పనైపోయిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున టాక్ నడిచింది. తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి.…
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో కూటమి పార్టీలు ఘన విజయం దక్కించుకున్నాయి. దాదాపు అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో కూటమి పార్టీలే…
పార్టీ పరంగా గెలుపు ఓటములు ఎలా ఉన్నా.. కీలకమైన ఎన్నికల్లో పోటీ చేయడమే గొప్ప అనేలా వైసీపీ వ్యవహారం ఉందా?…
రాష్ట్రం మొత్తంలో వైసీపీ పరిస్థితి, జగన్ పరిస్థితి ఎలా ఉన్నా.. తమకు పుట్టిల్లయిన.. పులివెందులలో మాత్రం ఒక ప్రతిష్టాత్మకం. అందుకే…