మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ కుటుంబాల మధ్య అనుబంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వీళ్లిద్దరూ బావ బావమరదులన్న సంగతి తెలిసిందే. చిరు మెగాస్టార్‌గా ఎదగడంలో అల్లు అరవింద్ తన వంతు పాత్ర పోషించారు. అలాగే అరవింద్ అగ్ర నిర్మాతగా వెలుగొందడంలో చిరు పాత్ర కూడా ఎంతో కీలకం. ఇద్దరి మధ్య వ్యక్తిగతంగా, వృత్తిపరంగా అద్భుతమైన రిలేషన్ ఉంది.
కాకపోతే గత దశాబ్ద కాలంలో కొన్ని కారణాల వల్ల మెగా, అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ వచ్చిందనే చర్చ జరగుతూ ఉంటుంది.
చిరు, అరవింద్‌ల బంధం ఎలా ఉన్నప్పటికీ అభిమానుల్లో మాత్రం వర్గాలు ఏర్పడ్డాయి. అందుకే వీళ్లిద్దరూ ఒకరు ఇంకొకరిని కొనియాడితే ఒకప్పుడు మామూలు విషయంగా ఉన్నది ఇప్పుడు వార్తగా మారుతోంది. తాజాగా అల్లు అరవింద్.. తన ప్రొడక్షన్లో వచ్చిన కొత్త సినిమా ‘ఆకాశంలో ఒక తార’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన జీవితంలో రెండు ముఖ్యమైన తారలు అంటూ చిరంజీవి, రామ్ చరణ్‌లకు ఎలివేషన్ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మీ జీవితంలో ముఖ్యమైన తారల గురించి చెప్పండి అని అల్లు అరవింద్‌ను అడగ్గా.. తొలి తారగా తన తండ్రి అల్లు రామలింగయ్య పేరు చెప్పారు. ఆయన వల్లే తాను ఇండస్ట్రీలోకి వచ్చానని అన్నారు. ఇక తాను నిర్మాతగా పెద్ద పెద్ద సినిమాలు తీసి, పెద్ద స్థాయికి వెళ్లడానికి కారణం మెగాస్టార్ చిరంజీవి అంటూ ఆయన్ని తన జీవితంలో రెండో తారగా చెప్పారు. ఇక తాను ఇప్పటికీ ఇండస్ట్రీలో సస్టైన్ అవుతూ, ఇంకా సినిమాలు తీయాలనే తపనతో సాగుతుండడానికి రామ్ చరణ్, అల్లు అర్జున్ కారణం అంటూ వాళ్లిద్దరూ కూడా తన జీవితంలో ముఖ్యమైన తారలని చెప్పుకొచ్చారు అరవింద్.
మెగాస్టార్‌తో ఒకప్పుడు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టారు అరవింద్. ఆ తర్వాత రామ్ చరణ్‌తో ‘మగధీర’ లాంటి మెగా హిట్ అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ ఇద్దరినీ తన జీవితంలో ముఖ్యమైన తారలుగా చెప్పడం మెగా, అల్లు మ్యూచువల్ ఫ్యాన్స్‌ను సంతోషపెడుతోంది. అరవింద్ నిర్మాణ భాగస్వామిగా ఉన్న ‘ఆకాశంలో ఒక తార’ నిన్న రాత్రి పెయిడ్ ప్రిమియర్స్ నుంచి అదిరిపోయే టాక్ తెచ్చుకుంది.
This post was last modified on November 20, 2026 2:30 pm
వైసీపీ మీద మరోసారి విరుచుకొని పడ్డారు ఎమ్మెల్సీ నాగబాబు. వైసీపీ ఒక డెడ్ బాడీ అని, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని…
వచ్చే వారం నవంబర్ 27 విడుదల కావాల్సిన హైందవ వాయిదా వేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కొత్త రిలీజ్ డేట్…
ఒక తెలుగు సినిమాకు యునానిమస్ రివ్యూలు, పబ్లిక్ టాక్ రావడం అరుదు. అది జరిగితే కలెక్షన్లకు అడ్డుకట్ట వేయడం ఎలాంటి…
గుణ్ణం గంగరాజు.. ఈ పేరు ఈ తరం సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ 90వ దశకం నుంచి…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో నిత్యం ఏదో ఒక రగడ కొనసాగుతూనే వుంది. ఒకరుపోతే మరొకరు అసంతృప్తి గళం వినిపించడం మామూలై…
ఇవాళ విడుదలైన ఆకాశంలో ఒక తార హీరోయిన్ సాత్విక వీరవల్లి ఇండస్ట్రీ దృష్టిలో బలంగా పడటం హాట్ టాపిక్ గా…