రష్మిక మందన్నా కెరీర్లో ఎక్కువగా స్టార్ హీరోల సరసన కథానాయికగానే నటించింది. ఈ మధ్యే ఆమె కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది. గత ఏడాది ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో పవర్ ఫుల్ పెర్ఫామెన్స్ ఇవ్వడమే కాక.. బాక్సాఫీస్ దగ్గరా తన పవర్ చూపించింది. ఇప్పుడు ఆమె నుంచి రాబోతున్న మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ మైసాపై మరింతగా అంచనాలున్నాయి.
ఈ సినిమా టీజర్ చూసి అందరూ షాకైపోయారు. సాఫ్ట్ గర్ల్‌లాగా కనిపించే రష్మికతో ఒక రేంజిలో యాక్షన్ ఘట్టాలు చేయించడం, చాలా రా అండ్ రస్టిక్ సినిమాలా ఉండడంతో మైసా సోషల్ మీడియాలో బాగానే ట్రెండ్ అయింది. ఈ సినిమా నుంచి ఇప్పుడు తొలి పాటను లాంచ్ చేశారు. మైసా రే.. అంటూ సాగే ఈ పాట ఇన్‌స్టంట్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఇప్పటిదాకా చూడని ఊర మాస్ అవతారంలో కనిపించిన రష్మిక తన నృత్యంతో, హావభావాలతో తాండవమాడేసిందనే చెప్పాలి. డ్యాన్స్‌లో ఇప్పటికే రష్మిక చాలా టాలెంట్ చూపించినప్పటికీ.. మైసా రే పాటలో స్టెప్స్ చాలా ప్రత్యేకం. కేవలం స్టెప్పులేస్తే సరిపోదు, ఎక్స్‌ప్రెషన్ కూడా ప్రత్యేకంగా ఉండాలి. దీని వెనుక ఎంతో ఎఫర్ట్ ఉందని పాటలో విజువల్స్ చూస్తే అర్థమవుతోంది. లెజెండరీ కొరియోగ్రాఫర్ బృంద ఈ పాటకు నృత్యరీతులు సమకూర్చగా దిగ్గజ గేయ రచయిత సుద్ధాల అశోక్ తేజ సాహిత్యం సమకూర్చారు. ఈ పాటను సింధుజ శ్రీనివాసన్ ఎంతో ఇంటెన్సిటీతో పాడింది.
రవీంద్ర పూలె దర్శకత్వంలో తెరకెక్కుతున్న మైసా మూవీ నవంబరు 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ కానున్న మైసా.. రష్మిక స్టార్ పవర్‌కు ఒక పరీక్షగా నిలవబోతోంది. ఈ సినిమా కోసం రష్మిక మామూలు కష్టం పడలేదు. డ్యాన్స్ చేస్తూ తుంటి గాయానికి గురై మూడు నెలలకు పైగా ఇంటికి పరిమితం అయింది కూడా ఈ సినిమాకు పని చేస్తూనే. మరి ఆమె కష్టానికి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి.
This post was last modified on November 2, 2026 11:24 pm
నాకు పెళ్ళెప్పుడవుతుంది బాబూ ... పిల్ల యాడ దొరుకుతుంది బాబోయ్ అనే సినిమా పాట పాడుకుంటున్నారు కేరళం యువకులు. అత్యధిక…
తెలంగాణలో పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్‌షా.. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కీలక…
ఏ ఇద్దరు నేతలు కలిసినా.. ఏ ఇద్దరు నాయకులు ఫోన్లు చేసుకున్నా.. ఇదే అంశంపై చర్చ సాగుతోంది. ఏపీలో తాజాగా…
సంతానం లేని ఆ దంపతులు తల్లి చనిపోయిన పసి బిడ్డను దత్తత తీసుకొని గుండెలకు హత్తుకున్నారు. ఆలానా పాలనా చూస్తూ…
ప్రపంచ ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి కాల పరిమితి తీరిపోయిన నేపథ్యంలో కొత్తగా పాలక మండలిని ఏర్పాటు…
తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న రిపీట్ కాంబో ఎట్టకేలకు రంగంలోకి దిగింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,…