ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ సాధించడం ఎప్పుడూ అపురూపమైందే. ఇన్ని దశాబ్దాల భారత క్రికెట్ చరిత్రలో తొలిసారిగా 2018లో టీమ్ ఇండియా ఈ ఘనతను సాధించింది. ఐతే అప్పుడు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లాంటి అగ్ర శ్రేణి ఆటగాళ్లు లేకపోవడం వల్లే భారత్ సిరీస్ విజయం సాధించగలిగిందనే వ్యాఖ్యలు వినిపించాయి.
ఐతే ఇప్పుడు వాళ్లిద్దరూ ఉండగా.. కోహ్లి సహా ప్రధాన ఆటగాళ్లు చాలామంది అందుబాటులో లేని సమయంలో తొలి టెస్టులో చిత్తుగా ఓడిన తర్వాత పుంజుకుని టెస్టు సిరీస్ గెలవడం అన్నది అసాధారణ విషయం. నిజానికి గబ్బాలో ముగిసిన చివరి టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఈ మ్యాచ్ గెలుస్తుందని ఎవరికీ ఆశల్లేవు. అసలు మన జట్టు గెలుపు కోసం ప్రయత్నించాలని కూడా పెద్దగా కోరుకోలేదు. ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ పిచ్‌ల్లో ఒకటనదగ్గ వికెట్ గబ్బా సొంతం. ఇలాంటి చోట టాప్ క్లాస్ ఆస్ట్రేలియా బౌలింగ్‌ను ఎదుర్కొంటూ మ్యాచ్ గెలవడం అంత తేలిక కాదు. విజయం కోసం ప్రయత్నిస్తే.. తేడా కొట్టి ఓటమి పాలయ్యే ప్రమాదం కూడా ఉంది.
అందుకే జాగ్రత్తగా రోజంతా ఓపిగ్గా ఆడి మ్యాచ్‌ను డ్రా చేసుకుంటే చాలనుకున్నారు అభిమానులు. ఎలాగూ చివరి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ గెలిచింది భారతే కాబట్టి ఈ సిరీస్ డ్రా అయినా ట్రోఫీ భారత్ దగ్గరే ఉంటుంది. ఈ స్థితిలో చివరి రోజు బ్యాటింగ్ ఆరంభించిన భారత్.. ఆరంభంలోనే ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. ఆ స్థితిలో మరో వికెట్ పడితే కథ వేరుగా ఉండేది. అలాంటి సమయంలో సీనియర్ ఆటగాడు, నయా వాల్ చెతేశ్వర్ పుజారా చూపించిన సంయమనం, పట్టుదల గురించి ఎంత చెప్పినా తక్కువే.
తొలి వికెట్ పడ్డ ఉత్సాహంలో ఆస్ట్రేలియా బౌలర్లు రెట్టించిన ఉత్సాహంతో బంతులేశారు. వాళ్లకు తెలుసు.. క్రీజును అంటుకుపోయే పుజారా ఒక్కడిని ఔట్ చేస్తే మిగతా జట్టును ఔట్ చేయడం అంత కష్టం కాదని. అందుకే అతణ్ని లక్ష్యంగా చేసుకున్నారు. బాడీ మీదికి ప్రమాదకర బౌన్సర్లు సంధించారు. ఐతే వాళ్లెంతగా పరీక్ష పెట్టినా పుజారా తొణకలేదు. అతడికి ఐదారు బంతులు ప్రమాదకరంగా తాకాయి. నొప్పితో విలవిలలాడాడు కానీ.. ఏకాగ్రత మాత్రం కోల్పోలేదు. ఒక ఎండ్‌లో అతను క్రీజు చుట్టూ గోడ కట్టేయడంతో.. అవతలి బ్యాట్స్‌మెన్ స్వేచ్ఛగా ఆడే అవకాశం దక్కింది. గిల్, రహానె, పంత్.. ఒకరి తర్వాత ఒకరు ధాటిగా ఆడగలిగారు.
పరుగుల్లో గిల్, పంత్ అతణ్ని మించి ఉండొచ్చు కానీ.. ఇన్నింగ్స్‌కు స్థిరత్వం తీసుకొచ్చింది, ఆస్ట్రేలియా బౌలర్లు అలసిపోయి, విసిగిపోయేలా, ఆత్మవిశ్వాసం కోల్పోయేలా చేసింది మాత్రం పుజారానే. అందుకే అతడి ఇన్నింగ్స్‌కు విలువ కట్టడం కష్టం. అతడి కెరీర్లోనే ఇది ఒకానొక ఉత్తమ ఇన్నింగ్స్‌గా చెప్పొచ్చు. ఈ మ్యాచ్‌లో రియల్ హీరో కూడా అతనే.
This post was last modified on January 19, 2021 9:43 pm
నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావులను తెలుగు సినిమాకు రెండు కళ్లుగా చెప్పేవారు ఒకప్పుడు. వీళ్లిద్దరూ ఎవరి స్థాయిలో వాళ్లు…
మహారాష్ట్రలో బీజేపీ కూటమి మహా విజయం దక్కించుకుంది. ఊహలకు సైతం అందని విధంగా దూకుడుగా ముందుకు సాగింది. తాజాగా జరిగిన…
ప్రభాస్ స్నేహితులు స్థాపించిన UV క్రియేషన్స్ ఈమధ్య ఊహించని విధంగా చేదు అనుభవాలను ఎదుర్కొంటోంది. మిర్చి సినిమాతో మొదలైన వీరి…
ఏపీలో 30వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అంటూ 2024 ఎన్నికలకు ముందు సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత, ఏపీ…
ఇటీవలే అబుదాబిలో జరిగిన ఐఫా అవార్డుల వేడుకలో దగ్గుబాటి రానా, తేజ సజ్జ చేసిన యాంకరింగ్ లో ఇతర హీరోల…
శ్రీ విష్ణు ఓం భీమ్ బుష్ మూవీ తో టాలీవుడ్ కు పరిచయమై తన గ్లామర్ తో కుర్ర కారు…