Movie News

బిసి సెంటర్స్‌లో ‘రిపీట్’ కావడం లేదా

మొన్న శుక్రవారం విడుదలైన ఈ నగరానికి ఏమైంది రిపీట్ అంచనాలకు మించి హైదరాబాద్, ఓవర్సీస్ లో అదరగొడుతోంది. వసూళ్లు ఊహించిన దానికన్నా మెరుగ్గా ఉన్నాయి. ఓవరాల్ రెవిన్యూలో సగానికి పైగా ఒక్క భాగ్యనగరం నుంచే వస్తోందని, దర్శకుడు తరుణ్ భాస్కర్ విజన్ ని వీళ్ళు అర్థం చేసుకున్నంతగా మిగిలిన వాళ్ళు పూర్తి స్థాయిలో రిసీవ్ చేసుకోలేదని ట్రేడ్ టాక్స్ ఉన్నాయి. ఇదిలా ఉండగా కింది స్థాయి బిసి సెంటర్స్ లో మేజిక్ ఎందుకు రిపీట్ కావడం లేదనే ప్రశ్న తలెత్తుతోంది.

దీనికి పెద్ద సైన్స్ పరిశోధన అవసరం లేదు. ఎందుకంటే ఈ నగరానికి ఏమైంది రిపీట్ టీమ్ ముందు నుంచి దీన్ని యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ప్రొజెక్ట్ చేస్తూ వచ్చింది. ప్రమోషన్లలో భాగంగా చేసిన ఇంటర్వ్యూలలో విశ్వక్ సేన్ తో పాటు పాల్గొన్న గ్యాంగ్ మొత్తం ట్రెండీ కామెడీతో ఎంటర్ టైన్ చేయడానికి ప్రయత్నించింది. ఇది సాధారణ మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే తీరు కాదు. దీంతో సహజంగానే నగర యువతని టార్గెట్ చేసుకున్నట్టుగా పబ్లిసిటీ ట్రాక్ మారిపోయింది.

ఇప్పుడు కలెక్షన్లలో బయటపడుతోంది అదే. అయితే యునానిమస్ టాక్ తెచ్చుకున్న ఆకాశంలో ఒక తారతో సమానంగా, ఒక్కోసారి దానికన్నా కొంచెం ఎక్కువ తక్కువ బుకింగ్ ట్రెండ్ మెయింటైన్ చేస్తున్న ఈ నగరానికి ఏమైంది రిపీట్ సోమవారం నుంచి ఎంత డ్రాప్ చూపిస్తుందనే దాన్ని బట్టి ఫైనల్ స్టేటస్ ఆధారపడి ఉంటుంది. దానికి ఇంకా టైం ఉంది. ఎందుకంటే వచ్చే వారం భోగి తప్ప చెప్పుకోదగ్గ రిలీజులు లేవు కాబట్టి విశ్వక్ టీమ్ కి ఇంకో అవకాశం దొరుకుతుంది.

మొదటి భాగం కూడా అప్పట్లో అర్బన్ ఆడియన్స్ ని మెప్పించింది తప్ప అన్ని వర్గాలను కాదు. కానీ వసూళ్లు పెద్దగా రాలేదు. అయితే రిపీట్ కు ఆ సమస్య రాలేదు. డబ్బులు వస్తున్నాయి. ఫ్లో ఇలాగే కంటిన్యూ అయితే మంచిదే. పబ్లిసిటీ కొనసాగించడం మంచి విషయం. కేవలం తెలంగాణకు పరిమితం కాకుండా విజయవాడ, గుంటూరు లాంటి ఏపీ నగరాలకు సైతం సక్సెస్ టూర్లకు వెళ్లడం తెలివైన ఎత్తుగడ. దీని తాలూకు రిజల్ట్ ఇంకో నాలుగైదు రోజుల్లో తెలుస్తుంది.  

This post was last modified on November 22, 2026 11:41 pm

Share

Recent Posts

ఓమ్‌లో ఎన్ని రెఫరెన్సులు ఉన్నాయో

టాక్ మిశ్రమంగా ఉన్నా ఓమ్ వసూళ్లు బాగున్నాయి. వీకెండ్ తర్వాత ఎంత శాతం డ్రాప్ ఉంటుందనేది రెండు రోజులు ఆగితే…

1 hour ago

భోగి మంటల్లో శత్రువుల దహనం

టాలీవుడ్ తెరమీద రక్తధారలు కొనసాగుతున్నాయి. హీరోలు మారుతున్నా వయొలెన్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలు కాసులు కురిపించే దిశగా ప్రేక్షకులు ముందుకు…

2 hours ago

యూపీ సీఎంలా పాలిస్తానంటున్న ఏపీ స్వామీజీ

ఏపీ పంచాయ‌తీ ఎన్నిక‌ల వేళ ఓ స్వామీజీ కూడా ఎన్నిక‌ల రంగంలోకి దిగారు. ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా మడకశిర నియోజ‌క‌వ‌ర్గంలోని…

2 hours ago

జ‌గ‌న్ ప‌ట్టు.. ష‌ర్మిల పంతం.. ముదిరిన ప్యాలెస్ వివాదం!

త‌న కుమార్తె అంజ‌లి పెళ్లిని బెంగ‌ళూరులోని య‌ల‌హంక ప్యాలెస్‌లో చేస్తామ‌ని ప్ర‌క‌టించిన ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల పంతం ఒక‌వైపు..…

3 hours ago

పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో `ప‌ట్టింపు` లేదు.. ఎవ‌రైనా పోటీ చేయండి: జ‌న‌సేన‌

ఏపీలో గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల కోలాహ‌లం జ‌రుగుతున్న క్ర‌మంలో జ‌న‌సేన పార్టీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ ఎన్నిక‌ల్లో ఎలాంటి…

3 hours ago

క్రేజీ సినిమాల హోరులో నలిగిపోయిన సావిత్రి

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ వారం విడుదలైన సినిమాల్లో అందరూ మాట్లాడుకుంటున్నవి ఆకాశంలో ఒక తార, ఈ నగరానికి ఏమైంది…

4 hours ago