చైనాలో తయారైన ఐస్ క్రీంలో కూడా కరోనా వైరస్ ఆనవాళ్ళు బయటపడటం సంచలనంగా మారింది. అసలే కరోనా వైరస్ కు డ్రాగన్ పుట్టిల్లనే విషయంపై యావత్ ప్రపంచదేశాలు మండిపోతున్నాయి. ఇటువంటి సమయంలోనే జంతువుల ద్వారానే కాకుండా చివరకు తినే ఆహారపదార్ధాల ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాపిస్తోందనే విషయం బయటపడటంతో జనాల్లో కలకలం రేగుతోంది. బీజింగ్ కు సమీపంలోని తియాన్జిన్ అనే ప్రాంతంలో మల్టీనేషనల్ స్ధాయి ఉన్న ఐస్ క్రీం తయారీ కంపెనీ ఉంది.
ఆ కంపెనీ తయారుచేసిన ఐస్ క్రీంలో కూడా కరోనా వైరస్ ఆనవాళ్ళు ఉన్నాయనే విషయం వెలుగుచూసింది. ఐస్ క్రీంలో కరోనా వైరస్ ఆనవాళ్ళు ఎలాగ కనిపించాయి ? ఎవరు గమనించారు ? అనే విషయాలు ఇంకా నిర్ధారణకాలేదు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాలతో సదరు కంపెనీ తాను తయారుచేసి సరఫరా చేసిన వేలాది కిలోల ఐస్ క్రీం కార్టన్లను మాత్రం వెనక్కు తెప్పించేసుకుంటోంది.
అయితే ఆరోపణలకు గురైనా కంపెనీ యాజమాన్యం మాత్రం తాము తయారుచేసిన ఐస్ క్రీం ఉత్పత్తుల్లో 390 కార్టన్లను మాత్రమే అమ్మకాలు జరిపినట్లు చెబుతోంది. 29 వేల కార్టన్లు ఇంకా తమ వద్దే ఉండిపోయిన విషయాన్ని కంపెనీ ప్రకటించింది. అయితే తాజాగా అమ్మిన 390 కార్టన్ల ఐస్ క్రీం కార్టన్లు ఏ ప్రాంతాలకు వెళ్ళింది, అక్కడ నుండి ఎవరెవరు కొనుగోళ్ళు చేశారనే విషయాన్ని కంపెనీ యాజమాన్యం సహకారంతో అధికారులు ట్రేస్ చేస్తున్నారు.
ఇదంతా ఇలాగుంటే ఐస్ క్రీం తయారుచేసిన కంపెనీ మాత్రం తాము దిగుమతి చేసుకున్న ఫుడ్ ఐటమ్స్ ద్వారా మాత్రమే కరోనా వైరస్ వచ్చి ఉండవచ్చని వాదిస్తోంది. ఐస్ క్రీం తయారీలో వాడే ఆహార ముడి పదార్ధాలను న్యూజిల్యండ్, ఉక్రెయిన్ నుండి దిగుమతి చేసుకుంటున్నట్లు చెప్పింది. ఒకవేళ కరోనా వైరస్ వచ్చుంటే ఆహారముడి పదార్ధాల ద్వారానే వచ్చి ఉండాలని మొత్తుకుంటోంది. ఏదేమైనా ఐస్ క్రీం ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాపిస్తోందనే విషయం ఇపుడు సంచలనంగా మారింది. అందుకనే కంపెనీలోని సిబ్బంది మొత్తాన్ని చైనా ప్రభుత్వం క్వారంటైన్ కేంద్రాలకు తరలించింది.
This post was last modified on January 18, 2021 11:02 am
కొత్త సంవత్సరం వేడుకల సందడి మొదలవడంతో తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ 31 సందర్భంగా వైన్…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీలోని నిగమ్బోధ్ ఘాట్లో సైనిక లాంఛనాలతో అధికారికంగా మన్మోహన్ సింగ్…
రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. ఎప్పుడు ఏం జరిగినా.. నాయకులు తమ మంచికేనని అనుకుంటారు. అయితే.. ఒక్కొక్కసారి జరిగే పరిణామాలు సంచలనాలకు…
సంక్రాంతి వస్తున్న సినిమాలు మూడు పెద్ద హీరోలవే. వాటిలో రెండింటికి సంగీత దర్శకుడు తమనే. అయితే గేమ్ చేంజర్, డాకు…
మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి అద్భుతంగా రాణించాడు. టెస్టు కెరీర్లో తన…
ఒక భాషలో హిట్టయిన సినిమాని రీమేక్ చేసుకోవడంలో ఎంతో సౌకర్యం ఉంటుంది. కాకపోతే ఒరిజినల్ వెర్షన్ కు దక్కిన ఫలితమే…