మొన్న ఢిల్లీ బస్సులో ఓ అమ్మాయిని రేప్ చేస్తే నేడు హైదరాబాద్ లో ఒకరి తర్వాత మరొకరు, ఎక్కడ దొరికితే అక్కడ ఓ మైనర్ బాలికను రేప్ చేశారు. నిండా పదహారేళ్లు లేని బాలికకు మత్తు చాకోలెట్లు ఇచ్చి రేప్ చేయడం కలకలం సృష్టిస్తుంది. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన యువత చట్టాలకు భయపడటం లేదు. పోలీసులకు భయపడటం లేదు. నామమాత్రంగా విధించే శిక్షలంటే భయం లేదు. దాంతో అమ్మాయిలు కనబడితే చాలు ఎగబడుతున్నారు. అత్యాచారమో, హత్యాచారమో చేసేస్తున్నారు. హైదరాబాద్ లో ఏమి జరిగిందంటే…
నగరంలోని మచ్చ బొల్లారంకు చెందిన ఓ బాలిక ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతుంది. ఆమెకు పదవ తరగతి చదువుతున్నప్పుడు జెర్రీ వరుణ్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. కొన్ని నెలల క్రితం అతడు మాయమాటలు చెప్పి బాలికను తన కారులో తీసుకెళ్లాడు. మత్తు చాక్లెట్ ఇచ్చి రేప్ చేశాడు. జెర్రీ వరుణ్ ద్వారా రోమల వరుణ్ పరిచయమయ్యాడు. అతడికి జెర్రీ రేప్ చేసిన విషయం తెలిసీ ఆ బాలిక మీద కన్నేశాడు. ఆ బాలికతో స్నేహం నటిస్తూ మద్యం, సిగరెట్లు, గంజాయి అలవాటు చేశాడు. కొంపల్లికి తీసుకెళ్లి రేప్ చేశాడు.
ఈ క్రమంలో ఇన్ స్టా లో ఆ బాలికకు డేవిడ్ వరుణ్ పరిచయమయ్యాడు. వాడు కూడా ఆ బాలికకు మద్యం తాగించి అసభ్యంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో నిండా మునిగిపోయాక కూతురి ప్రవర్తన మీద తలిదండ్రులకు అనుమానం వచ్చింది. పద్దతి మార్చుకొని బాగా చదువుకోమంటూ మందలించారు. దాంతో ఆ బాలిక ఇల్లొదిలి వెళ్లి పోయింది. బొల్లారం రైల్వే స్టేషన్ కు చేరుకుంది. ఒంటరిగా తిరుగుతున్న బాలిక మీద నీరజ్ అనే వ్యక్తి కన్నేశాడు.
నీరజ్ తన స్నేహితుడు విక్కీని పిలిచాడు. ఇద్దరూ కలిసి బాలికను తీసుకెళ్లి మత్తులోకి దించారు. ఒకరి తర్వాత మరొకరు లైంగిక దాడికి పాల్పడ్డారు. అక్కడ నుంచి నీరజ్ వెళ్ళిపోయాడు. విక్కీ మాత్రం వెళ్లకుండా తన మిత్రుడు నిఖిల్ ని పిలిపించాడు. ఇద్దరూ కలిసి ఆ బాలికను దూలపల్లి తీసుకెళ్లారు. అక్కడకు మరో ఇద్దరు వచ్చారు. ఓయో రూం తీసుకొని బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారు.
ఆ తర్వాత కూడా విక్కీ ఆ బాలికను వదిలిపెట్టలేదు. బొల్లారంలోని తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ నుంచి ఆ బాలిక తప్పించుకొని రైల్వే స్టేషన్ కు పారిపోయింది. విక్కీ, తన స్నేహితుడు గణేష్ తో కలిసి ఆమెను వెంబడించాడు. ఆ బాలికను మేడ్చల్ రైల్వే స్టేషన్ కు తీసుకోచ్చి రైల్లోనే రేప్ చేశారు. మల్కాజ్ గిరి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా తప్పించుకున్న బాలిక ఇంటికి చేరుకుంది. జరిగిన విషయం తలిదండ్రులకు చెప్పింది. అల్వాల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎనిమిది మంది మీద పొక్సో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates