హైదరాబాద్‌కు చెందిన ఓ దంపతులు ఐదు నెలలు అమెరికాలో ఉండాలని ప్లాన్ చేసుకుని మయామీ వెళ్లారు. ఐదు నెలల తర్వాత భారత్‌కు తిరిగి వచ్చేలా రిటర్న్ టికెట్ కూడా ముందే బుక్ చేసుకున్నారు. కానీ అమెరికా ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తర్వాత అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు మాత్రం రెండు నెలల వరకు మాత్రమే ఉండేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో ఐదు నెలల ట్రిప్ ప్లాన్ చేసిన కుటుంబం ఇప్పుడు రెండు నెలల్లోనే తిరిగి రావాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, అమెరికా వీసా ఉన్నప్పుడు ఐదు నెలలు ఎందుకు ఉండనివ్వరు? అసలు వీసా అంటే అమెరికాలో ఆరు నెలలు ఉండేందుకు ఇచ్చే పర్మిషన్ కాదు. వీసా ఉంటే అమెరికా వరకు వెళ్లి అక్కడ ఎంట్రీ కోరవచ్చు. దేశంలోకి అనుమతించాలా వద్దా, అనుమతిస్తే ఎంతకాలం ఉండొచ్చన్న చివరి నిర్ణయం ఎయిర్‌పోర్టులోని ఇమ్మిగ్రేషన్ అధికారిదే.
ఈ దంపతులు మయామీ చేరుకున్న తర్వాత వారిని సెకండరీ ఇన్‌స్పెక్షన్‌కు పంపించారు. తండ్రికి భారత్‌లో ఉద్యోగం ఉండగా ఐదు నెలలు అమెరికాలో ఎందుకు ఉండాలని అధికారి ప్రశ్నించినట్లు వారి కుమారుడు సోషల్ మీడియాలో తెలిపాడు. కుటుంబంలో బిడ్డ పుట్టే సమయంలో అక్కడ ఉండేందుకు వచ్చామని చెప్పినా, అధికారులు రెండు నెలల స్టే మాత్రమే ఇచ్చినట్లు పేర్కొన్నాడు.
అమెరికాలో ఎంతకాలం ఉండొచ్చన్నది ఐ-94లో కనిపిస్తుంది. ఉదాహరణకు వీసా మరో ఐదేళ్లు వాలిడ్‌గా ఉన్నా, ఐ-94లో నవంబర్ 5 వరకు మాత్రమే అనుమతి ఉంటే ఆ తేదీలోపే దేశం నుంచి బయటకు రావాలి. ఈ కుటుంబం ఐదు నెలల తర్వాత రిటర్న్ టికెట్ బుక్ చేసుకున్నా, అది ఐదు నెలలు ఉండేందుకు ప్రభుత్వ అనుమతి ఇచ్చినట్లు కాదు. ఇప్పుడు వాళ్లు ఆ టికెట్‌ను ముందుకు మార్చుకోవాల్సి ఉంటుంది.
అసలైతే విజిటర్ వీసాతో కొందరికి ఆరు నెలల వరకు స్టే ఇవ్వొచ్చు. కానీ ప్రతి ఒక్కరికీ అంతే సమయం ఇవ్వాలనే రూల్ లేదు. ప్రయాణం ఎందుకు, ఎంతకాలం ఉండబోతున్నారు, భారత్‌తో వారికి ఉన్న సంబంధాలు ఏంటి వంటి విషయాలు చూసి అధికారులు తక్కువ సమయం కూడా ఇవ్వొచ్చు. ఈ హైదరాబాద్ దంపతుల విషయంలో కూడా అమెరికాలో ఎంట్రీని ఆపలేదు.. ఐదు నెలల బదులు రెండు నెలల వరకే ఉండాలని నిర్ణయించారు.
This post was last modified on September 8, 2026 10:41 am
ట్రాఫిక్ చలాన్ వచ్చిందంటే వెంటనే కట్టేవాళ్లు కొందరైతే.. నెలలు, ఏళ్లుగా పెండింగ్‌లో పెట్టేవాళ్లు కూడా ఉన్నారు. ఇలా దేశవ్యాప్తంగా వసూలు…
ప్రస్తుతం ఇండియాలో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే ఎక్కువమంది చెప్పే పేరు.. అనిరుధ్ రవిచందర్‌దే. పేరుకు తమిళ…
రాష్ట్రంలో మంగళగిరి నియోజకవర్గం అత్యంత కీలకంగా మారింది. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రసిడెంట్, విద్యా శాఖ మంత్రి నారా…
ఇంకో రెండు వారాల్లో దసరా పండగ రానుంది. సెలవుల సీజన్ కావడంతో పిల్లా పెద్ద అందరూ ఎదురు చూస్తున్నారు. బయ్యర్…
మొన్నటిదాకా ఇండస్ట్రీలో ఒకటే గుసగుస. ఏఐ వచ్చేసిందిగా, ఇకపై గ్రాఫిక్స్ కోసం కోట్లు తగలేయాల్సిన పనేముంది అని చాలామంది లెక్కలేసుకున్నారు.…
దర్శకుడు పూరి జగన్నాథ్ కొత్త సినిమా 'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్' విడుదల వ్యవహారం ఇంకా తేలలేదు. నిన్న…