మొన్నటిదాకా ఇండస్ట్రీలో ఒకటే గుసగుస. ఏఐ వచ్చేసిందిగా, ఇకపై గ్రాఫిక్స్ కోసం కోట్లు తగలేయాల్సిన పనేముంది అని చాలామంది లెక్కలేసుకున్నారు. ఫోన్లలో కనిపించే కొన్ని షార్ట్ వీడియో క్లిప్పులు చూసి, జక్కన్న సినిమాకి కూడా ఖర్చు సగానికి తగ్గిపోతుందేమో అనుకున్నారు. అయితే ఈ సోషల్ మీడియా భ్రమలపై రీసెంట్ ఇంటర్వ్యూలో బాహుబలి ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ స్పందిస్తూ అసలు విషయాన్ని బయటపెట్టారు.
నిజానికి ఏఐ టూల్స్ వల్ల పని స్పీడప్ అవుతుందన్న మాట వాస్తవమేనని శోభు ఒప్పుకున్నారు. డైరెక్టర్ తన ఆలోచనలను టీమ్‌కి వెంటనే చూపించడానికి, స్టోరీ బోర్డింగ్, కాన్సెప్ట్ ఆర్ట్ లాంటి పనులకు ఏఐ బాగా ఉపయోగపడుతుందని వివరించారు. అంతేకానీ, థియేటర్లలో కూర్చున్న ఆడియన్స్‌కి గూస్‌బంప్స్ ఇచ్చే రేంజ్ అవుట్‌పుట్ ఇచ్చే స్థాయికి ఇంకా రాలేదని కుండబద్దలు కొట్టారు. ఇద్దరు కొట్టుకునే సీన్ కావాలంటే ఏదో ఒకటి తెచ్చి స్క్రీన్ మీద పడేస్తుంది గానీ, హీరో ఎటునుంచి కొట్టాలి, విలన్ బాడీ ఎక్కడ బెండ్ అవ్వాలనే పక్కా ప్లానింగ్ మిషన్లకి రాదని ఆయన స్పష్టం చేశారు.
పైగా ఇన్‌స్టా రీల్స్ స్క్రీన్లలో చూసి చప్పట్లు కొట్టడం వేరు, 70 ఎంఎం బిగ్ స్క్రీన్ మీద సినిమా చూడటం వేరు అని శోభు గుర్తుచేశారు. మొబైల్ డిస్‌ప్లేలో అదిరిపోయింది అనుకున్న విజువల్ కాస్తా పెద్ద తెరపైకి వెళ్తే క్వాలిటీ తేలిపోతుందని, అందుకే ఫోన్లలో చూసి మురిసిపోవడం తప్ప థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌కి ఇది పనికిరాదని పేర్కొన్నారు. సినిమా అంటే పది సెకన్ల వీడియో క్లిప్ కాదని, రెండున్నర గంటల పాటు కొనసాగే ఎమోషనల్ కంటిన్యూటీ అని, సీన్ మారినా క్యారెక్టర్ల ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ మిస్సవ్వకుండా కాపాడే సత్తా ప్రస్తుతానికి ఏఐకి లేదని తేల్చిచెప్పారు.
అందుకే రాజమౌళి లాంటి డైరెక్టర్లు టెక్నాలజీ మారినా అసలైన క్రాఫ్ట్‌ని వదిలిపెట్టడం లేదని శోభు చెప్పుకొచ్చారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో కోట్ల ఖర్చుతో మోషన్ క్యాప్చర్ సెటప్ పెట్టడం వెనుక కారణాన్ని కూడా ప్రస్తావించారు. చేను దున్నడం ఎలాగో రైతుకే తెలుస్తుంది, అక్కడ నాగలి వాడినా ట్రాక్టర్ వాడినా మనిషి ఉండాల్సిందే అని గుర్తుచేశారు. షార్ట్‌కట్ ఏఐ దారుల్లో వెళ్లి క్వాలిటీ తగ్గించే బదులు, బడ్జెట్ ఎక్కువైనా సరే పక్కా రియలిస్టిక్ అవుట్‌పుట్ కోసమే జక్కన్న టీమ్ మొగ్గు చూపుతోందని క్లారిటీ ఇచ్చారు. టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయినా, స్క్రీన్ మీద ఆ మ్యాజిక్ పండాలంటే మనుషుల ఆలోచన, కష్టం తప్పనిసరి అని శోభు ఒక క్లారిటీ ఇచ్చారు. ఇక క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేని మేకర్స్ ఉన్నంతవరకు వారణాసి లాంటి పాన్ వరల్డ్ ప్రాజెక్టుల బడ్జెట్ తగ్గే తగ్గేలా లేదని అనిపిస్తోంది.
This post was last modified on September 29, 2026 11:27 am
దర్శకుడు పూరి జగన్నాథ్ కొత్త సినిమా 'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్' విడుదల వ్యవహారం ఇంకా తేలలేదు. నిన్న…
వైసీపీ అధినేత జగన్ నివాసం ఉండే తాడేపల్లి ప్రాంతం.. మంగళగిరి నియోజకవర్గంలో ఉంటుంది. ఇక్కడ అనేక మంది పేదలు.. దిగువ…
రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాలకు తమిళనాడు కేరాఫ్‌గా ఉంది. నాటి జయలలిత, కరుణానిధి ప్రభుత్వాల నుంచి నేటి…
తమిళంలో పేరున్న దర్శకుల్లో వెంకట్ ప్రభు ఒకరు. చెన్నై-28తో మొదలుపెట్టి చాలా హిట్లే ఇచ్చారు. చివరగా విజయ్ హీరోగా గ్రేటెస్ట్…
ఎలక్ట్రానికి ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లపై చాలా సంవత్సరాలుగా చర్చ నడుస్తోంది. ఈవీఎంలు ట్యాంపర్ చేయడం సాధ్యమేనని కొందరు ప్రోటోటైప్ ఈవీఎంలను ట్యాంపర్…
రాజకీయాల్లో వ్యూహాలు ఎప్పుడొకప్పుడు బెడిసికొట్టడం సహజం. కానీ, ఒక ఉమ్మడి జిల్లాలో పార్టీ అధినేత నేరుగా రంగంలోకి దిగి పావులు…