ఇంకో రెండు వారాల్లో దసరా పండగ రానుంది. సెలవుల సీజన్ కావడంతో పిల్లా పెద్ద అందరూ ఎదురు చూస్తున్నారు. బయ్యర్ వర్గాలకు సంక్రాంతి తర్వాత కీలకమైన సీజన్ ఇదే. కరెక్ట్ హిట్ పడిందా రికార్డులు బద్దలయ్యే రేంజ్ లో బ్లాక్ బస్టర్లు చూడొచ్చు. గత కొన్నేళ్లుగా సూపర్ హిట్లు వస్తున్నాయి కానీ రికార్డులు తిరిగ రాసేవి విజయదశమిని మిస్ చేసుకుంటున్నాయి. అయితే ఈసారి పోటీ ఆసక్తికరంగా ఉండటంతో ఆడియన్స్ ని కనక మెప్పించగలిగితే కొత్త మైలురాళ్ళు చూసే అవకాశముంది.
ముందుగా బరిలో దిగుతున్న ‘ఆదర్శ కుటుంబం ఏకె 47’ మీద కుటుంబ ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ – వెంకటేష్ మొదటిసారి కాంబోకుండాల్సిన హైప్ కనిపించకపోయినా అసలు కంటెంట్ సర్ప్రైజ్ ఇస్తుందని, అల వైకుంఠపురములో మించిన ఎంటర్ టైనర్ మాటల మాంత్రికుడు ఇస్తారని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. అందరికన్నా ముందు అక్టోబర్ 9నే వస్తున్న నేపథ్యంలో టాక్ పాజిటివ్ ఉంటే మటుకు కలెక్షన్ల జాతర ఖాయం.
శ్రీవిష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ అదే డేట్ తీసుకుంది. ఇప్పటికైతే ఎలాంటి మార్పు లేదనే సంకేతాలు ఇస్తున్నారు. ప్రమోషన్లు కూడా ఆ తేదీతోనే జరుగుతున్నాయి. వారం తిరక్కుండానే రజనీకాంత్’ జైలర్ 2′ భారీ హైప్ తో తెలుగు రాష్ట్రాల్లో రానుంది. పంపిణి హక్కులు నాగవంశీ తీసుకోవడంతో స్క్రీన్ కౌంట్ పరంగా ఇబ్బంది ఉండదు. ఇప్పటికైతే ఆకాశం బద్దలయ్యే రేంజ్ లో బజ్ లేదు కానీ రిలీజ్ నాటికి లెక్కలు, అంచనాలు మారిపోయేలా సన్ పిక్చర్స్ పబ్లిసిటీని ప్లాన్ చేస్తోందట.
ఇక ‘రణబాలి’ మీద విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కొండంత నమ్మకం పెట్టుకున్నారు. స్వతంత్రం రాకముందు సీమలో జరిగిన నిజజీవిత సంఘటనల ఆధారంగా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ దీన్ని రూపొందించారు. ఇవి కాకుండా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ‘గరివిడి లక్ష్మి’ చాలా గ్యాప్ తర్వాత మోక్షం దక్కించకోనుంది. ఇంత కాంపిటీషన్ మధ్య స్టార్ క్యాస్టింగ్ లేకుండా నెగ్గుకురావడం సవాలే. అన్ని వేర్వేరు జానర్లు కావడం వల్ల లాభం ఎవరికి అనే కోణం చూసుకుంటే సహజంగా స్టార్లకే ఎక్కువ అవకాశాలుంటాయి. విజేత ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మాత్రం వేచి ఉండాల్సిందే.
This post was last modified on September 29, 2026 12:03 pm
మొన్నటిదాకా ఇండస్ట్రీలో ఒకటే గుసగుస. ఏఐ వచ్చేసిందిగా, ఇకపై గ్రాఫిక్స్ కోసం కోట్లు తగలేయాల్సిన పనేముంది అని చాలామంది లెక్కలేసుకున్నారు.…
దర్శకుడు పూరి జగన్నాథ్ కొత్త సినిమా 'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్' విడుదల వ్యవహారం ఇంకా తేలలేదు. నిన్న…
వైసీపీ అధినేత జగన్ నివాసం ఉండే తాడేపల్లి ప్రాంతం.. మంగళగిరి నియోజకవర్గంలో ఉంటుంది. ఇక్కడ అనేక మంది పేదలు.. దిగువ…
రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాలకు తమిళనాడు కేరాఫ్‌గా ఉంది. నాటి జయలలిత, కరుణానిధి ప్రభుత్వాల నుంచి నేటి…
తమిళంలో పేరున్న దర్శకుల్లో వెంకట్ ప్రభు ఒకరు. చెన్నై-28తో మొదలుపెట్టి చాలా హిట్లే ఇచ్చారు. చివరగా విజయ్ హీరోగా గ్రేటెస్ట్…
ఎలక్ట్రానికి ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లపై చాలా సంవత్సరాలుగా చర్చ నడుస్తోంది. ఈవీఎంలు ట్యాంపర్ చేయడం సాధ్యమేనని కొందరు ప్రోటోటైప్ ఈవీఎంలను ట్యాంపర్…