Movie News

అనిరుధ్ మీద ఎన్నడూ లేనంత నెగెటివిటీ

ప్రస్తుతం ఇండియాలో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే ఎక్కువమంది చెప్పే పేరు.. అనిరుధ్ రవిచందర్‌దే. పేరుకు తమిళ సంగీత దర్శకుడు కానీ.. అతడికి దక్షిణాదిన అంతా పెద్ద స్థాయిలో అభిమాన గణం ఉంది. నార్త్ ఇండియాలో కూడా తన మ్యూజిక్ పాపులరే. ఏ సినిమాకు పని చేసినా.. తన సంగీతంతో బలమైన ముద్ర వేస్తుంటాడు అనిరుధ్. అతడి సంగీతం విషయంలో నెగెటివిటీ రావడం అరుదు.

అలాంటి సంగీత దర్శకుడు ఇప్పుడు ఉన్నట్లుండి బాగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. రెండు క్రేజీ సినిమాలకు సంబంధించి తన పనితనంపై నెగెటివిటీ వస్తోంది. గత గురువారం రిలీజైన ‘ది ప్యారడైజ్’కు అనిరుధ్ మ్యూజిక్ విషయంలో మిశ్రమ స్పందన వచ్చింది. ఆల్రెడీ రిలీజైన ఆయాషేర్, యేషనాగుల కట్ట, సమ్మక్క పాటలు మంచి స్పందనే తెచ్చుకున్నాయి కానీ.. ఈ సినిమా సెకండాఫ్‌లో వచ్చిన ఇంగ్లిష్ సాంగ్ ఏమాత్రం సింక్ లేకుండా ఉండడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి.

అలాగే అనిరుధ్ బీజీఎం కూడ అంచనాలను అందుకోలేకపోయింది. చాలా చోట్ల సన్నివేశాలకు, బీజీఎంకు సింక్ కుదరలేదు. ఎలాంటి సినిమానైనా తన బీజీఎంతో ఎలివేట్ చేయడానికి ప్రయత్నించే అనిరుధ్.. ఈసారి టైం తక్కువ ఉండడం వల్లో ఏమో సరైన ఔట్‌పుట్ ఇవ్వలేకపోయాడు.
ఈ సినిమాకు అనిరుధ్ పనితనం విషయంలో విమర్శలు వస్తున్న సమయంలోనే.. అతను పని చేస్తున్న మెగా మూవీ ‘జైలర్-2’ నుంచి ‘వన్ మూన్ వన్ సన్’ పాట రిలీజైంది.

ఇది ‘హుకుం’ తరహాలో రజినీకి ఎలివేషన్ ఇచ్చే పాట అంటూ రిలీజ్‌కు ముందు తెగ హైప్ ఇచ్చారు. ఈ పాట కంపోజిషన్ గురించి అనిరుధ్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కలిసి ఒక వీడియో కూడా చేశారు. అందులో బిల్డప్ చూస్తే.. ఈ పాట వేరే లెవెల్లో ఉంటుందని.. ‘హుకుం’ను మించి పోతుందని అనుకున్నారు. కానీ తీరా పాటను వింటే.. నీరసం వచ్చేసింది. అంత పేలవంగా పాటను తీర్చిదిద్దాడు అనిరుధ్.

హీరో ఎలివేషన్ పాటలో ఉండాల్సిన ఊపు ఎంతమాత్రం లేదు. ఇంటర్నేషనల్ టచ్ అంటూ ఏదో రొమాంటిక్ పాటలా దీన్ని తయారు చేశారు. ఇంతకుముందు ఈ సినిమా నుంచి ‘కావాలయ్యా’ తరహాలో ఒక ఐటెం సాంగ్ రిలీజ్ చేయగా.. అది అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పుడు రిలీజ్ చేసిన పాట మరీ సాధారణంగా ఉండడంతో అనిరుధ్‌‌ మీద సోషల్ మీడియాలో గట్టిగా విమర్శలు వస్తున్నాయి. ఓవైపు ‘ప్యారడైజ్’ విషయంలో, ఇంకోవైపు ‘జైలర్-2’కు సంబంధించి అనిరుధ్ ఒకే సమయంలో బాగా నెగెటివిటీ తెచ్చుకున్నాడు.

This post was last modified on September 29, 2026 12:50 pm

Share

Recent Posts

ఇలాగైతే లోకేష్ ను వైసీపీ ఓడించినట్టే

రాష్ట్రంలో మంగళగిరి నియోజకవర్గం అత్యంత కీలకంగా మారింది. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రసిడెంట్, విద్యా శాఖ మంత్రి నారా…

21 minutes ago

దసరా బరిలో ఎవరికి ఎక్కువ లాభం

ఇంకో రెండు వారాల్లో దసరా పండగ రానుంది. సెలవుల సీజన్ కావడంతో పిల్లా పెద్ద అందరూ ఎదురు చూస్తున్నారు. బయ్యర్…

1 hour ago

ఏఐ సినిమా… ఫోన్లో చూసి మురిసిపోవడమే

మొన్నటిదాకా ఇండస్ట్రీలో ఒకటే గుసగుస. ఏఐ వచ్చేసిందిగా, ఇకపై గ్రాఫిక్స్ కోసం కోట్లు తగలేయాల్సిన పనేముంది అని చాలామంది లెక్కలేసుకున్నారు.…

2 hours ago

‘స్లమ్ డాగ్’ సౌండ్ ఎప్పుడు వినపడుతుంది

దర్శకుడు పూరి జగన్నాథ్ కొత్త సినిమా 'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్' విడుదల వ్యవహారం ఇంకా తేలలేదు. నిన్న…

2 hours ago

జ‌గ‌న్‌కు ప‌ట్ట‌లేదు… లోకేష్ ప‌ట్టించుకున్నారు

వైసీపీ అధినేత జ‌గ‌న్ నివాసం ఉండే తాడేప‌ల్లి ప్రాంతం.. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఉంటుంది. ఇక్క‌డ అనేక మంది పేద‌లు.. దిగువ…

2 hours ago

మేన‌మామ ఉంగ‌రం విలువ 750 కోట్లు

రాష్ట్ర ప్ర‌భుత్వాలు అమ‌లు చేస్తున్న ఉచిత ప‌థ‌కాల‌కు త‌మిళ‌నాడు కేరాఫ్‌గా ఉంది. నాటి జ‌య‌ల‌లిత, క‌రుణానిధి ప్ర‌భుత్వాల నుంచి నేటి…

4 hours ago