Trends

స్టీరింగ్‌కు ముద్దుపెట్టి.. బస్సుకు సెల్యూట్‌ చేసి వీడ్కోలు

30 ఏళ్లకుపైగా తాను నడిపిన బస్సుకు ఓ డ్రైవర్‌ భావోద్వేగ వీడ్కోలు పలికిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్‌ఆర్‌టీసీ) ఇడుక్కి జిల్లాలోని కుమిలి డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న పాల్‌ కురియన్‌ సెప్టెంబరు 2న తన చివరి విధి నిర్వహించారు.

చివరి ట్రిప్‌ ముగించుకుని బస్సును డిపోలో పార్క్‌ చేసిన అనంతరం ఆయన కొద్దిసేపు స్టీరింగ్‌ వద్దే ఉండిపోయారు. అనంతరం స్టీరింగ్‌కు ఆప్యాయంగా ముద్దుపెట్టి.. బస్సుకు సెల్యూట్‌ చేశారు. తనతో ఇన్నాళ్లు ప్రయాణించిన వాహనాన్ని చివరిసారిగా చూసుకుంటూ అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయారు.

ఈ దృశ్యాలను కేఎస్‌ఆర్‌టీసీ అధికారులు సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో విస్తృతంగా వైరల్‌ అయ్యాయి. డ్రైవర్‌ పాల్‌ కురియన్‌ వృత్తిపై చూపిన అంకితభావం, బస్సుతో ఏర్పడిన అనుబంధాన్ని చూసి పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పదవీ విరమణ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ భావోద్వేగ సందేశాలు పోస్ట్‌ చేస్తున్నారు.

ఏళ్ల తరబడి తాను నడిపిన బస్సుకు పదవీ విరమణ సందర్భంగా డ్రైవర్‌ పాల్‌ కురియన్‌ వంగి నమస్కరించిన దృశ్యం పలువురిని కదిలించింది. ప్రజా రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న వేలాది మంది కార్మికుల నిబద్ధత, వృత్తిపై గర్వమే సంస్థకు నిజమైన బలమని కేరళ ప్రభుత్వం పేర్కొంది. పాల్‌ కురియన్‌ వంటి ఉద్యోగుల సేవలు ప్రజా రవాణా వ్యవస్థకు ఎంతో విలువైనవని తెలిపింది.

This post was last modified on September 4, 2026 11:21 am

Share

Recent Posts

మంచి ఛాన్స్ వదిలేసిన బ్లాక్ బస్టర్

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం నమోదు చేసిన హనుమాన్ అంశ్ ఇప్పటిదాకా మూడు వందల యాభై…

59 minutes ago

మగాళ్ళకు పీరియడ్స్ వస్తే..?

ఆడవాళ్లకు మాత్రమే పరిమితమైన కొన్ని బాధల గురించి ఇటీవల పెద్ద చర్చ జరుగుతోంది. పురిటి నొప్పులతో పాటు నెలవారీ పీరియడ్స్…

2 hours ago

డింపుల్ హయతి లో ఈ టాలెంట్ కూడా ఉందా?

డింపుల్ హయతి.. ఈ పేరు వినగానే ఎవరో ముంబయి భామ అనుకుంటారు. ఆమె చేసిన పాత్రలు.. తన అప్పీయరెన్స్ అదీ…

5 hours ago

క్యాబ్ ఎక్కెలోపే బలవంతంగా ముద్దు పెట్టిన సెక్యూరిటీ

ఆఫీసుకు వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకుని పీజీ నుంచి బయటకు వచ్చిన అమ్మాయికి చేదు అనుభవం ఎదురైంది. క్యాబ్ దగ్గరకు…

6 hours ago

ప్యారడైజ్… తెలంగాణలో ఒక పండగ మాదిరి

సినిమా అనేది యూనివర్శల్ అయినా.. లోకల్‌గా జనాలకు కనెక్ట్ అయ్యే కథాంశాలను ఎంచుకోవడం, ఆయా ప్రాంతాల వారికి కనెక్ట్ అయ్యేలా…

6 hours ago

కేబినెట్ మీటింగ్ కు కళ్యాణ్ సార్ వచ్చారు

ఎట్టకేలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి చంద్రబాబు…

6 hours ago