Trends

అప్పుడు పాక్‌కు చిక్కిన హీరో… ఇప్పుడు ప్రయాణికుల పైలట్

2019లో పాకిస్థాన్‌తో జరిగిన వైమానిక పోరుతో అభినందన్ వర్ధమాన్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. ఇప్పుడు అతను కొత్త కెరీర్ మొదలుపెట్టారు. దాదాపు 22 ఏళ్ల పాటు భారత వైమానిక దళంలో పనిచేసిన అభినందన్, ఐఏఎఫ్‌కు గుడ్‌బై చెప్పి ప్రైవేట్ ఎయిర్‌లైన్ ఫ్లై91లో కమర్షియల్ పైలట్‌గా చేరారు. గ్రూప్ కెప్టెన్ హోదాలో ఉన్న అభినందన్ మార్చి 31న ప్రీమేచ్యూర్ రిటైర్మెంట్ తీసుకున్నారు. 

ఆ తర్వాత గోవా కేంద్రంగా పనిచేసే ఫ్లై91లో చేరారు. ప్రస్తుతం గోవా – హైదరాబాద్ రూట్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అవసరమైన ట్రైనింగ్, అనుమతులు పూర్తయిన తర్వాత ప్రయాణికుల విమానాలను నడపనున్నారు. ఫ్లై91 ప్రస్తుతం ఏటీఆర్ 72-600 విమానాలతో ప్రాంతీయ సర్వీసులు నడుపుతోంది. దీంతో మిగ్-21 బైసన్ లాంటి ఫైటర్ జెట్ నడిపిన అభినందన్ ఇప్పుడు ఏటీఆర్ ప్యాసింజర్ విమానం కాక్‌పిట్‌లో కనిపించనున్నారు. 

అయితే ఆయన రెగ్యులర్ సర్వీసులు ఎప్పుడు ప్రారంభిస్తారన్న విషయం ఇంకా బయటకు రాలేదు. అభినందన్‌కు 2019 ఫిబ్రవరి 27న జరిగిన ఘటనతో గుర్తింపు వచ్చింది. భారత అధికారిక రికార్డుల ప్రకారం తన మిగ్-21తో పాకిస్థాన్ ఎఫ్-16ను కూల్చారు. అదే పోరులో ఆయన విమానం కూడా దెబ్బతింది.

ఎజెక్ట్ అయిన తర్వాత పాకిస్థాన్ భూభాగంలో దిగడంతో అక్కడి సైన్యం అదుపులోకి తీసుకుంది. మూడు రోజుల తర్వాత భారత్‌కు తిరిగివచ్చారు. ఆ ఘటనలో చూపిన ధైర్యానికి అభినందన్‌కు వీర్ చక్ర లభించింది. 2021లో గ్రూప్ కెప్టెన్‌గా ప్రమోషన్ కూడా పొందారు. ఇప్పుడు మాత్రం యుద్ధ విమానాల నుంచి కమర్షియల్ ఫ్లైట్స్ వైపు మారారు. ఫ్లై91లో ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఏ రూట్లలో సేవలు ప్రారంభిస్తారో చూడాలి.

This post was last modified on September 3, 2026 2:29 pm

Share

Recent Posts

సర్పంచ్ అంటే ఇలా ఆలోచించాలి

నేటి సమాజంలో కుటుంబ వ్యవస్థలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. చదువులు, ఉద్యోగాలు, మెరుగైన జీవన ప్రమాణాల కోసం యువత పట్టణాలు,…

1 hour ago

అర్జునుడి వెనుక ఇంత మంది పాండవులా

కొత్త హీరో నటించిన సినిమా అంటే జనాల్లో అంత సులభంగా అటెన్షన్ రాదు. ప్రమోషన్లు బలంగా చేసినా ఏదో ఒక…

3 hours ago

2024తో పోలిస్తే కూటమికి ఎంత లాభం? వైసీపీకి ఎంత నష్టం?

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ల తర్వాత స్థానిక ఎన్నికలు జరిగాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్ల…

4 hours ago

చెల్లికి ద్రోహం… తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్ సినిమా!

మ‌హిళా సెంటిమెంటు రాజ‌కీయాల‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేస్తుంద‌న్న‌ది తెలిసిందే. అందునా.. రాజ‌కీయ నేత‌ల కుటుంబాల‌కు చెందిన మ‌హిళ‌ల విష‌యంలో మ‌రింత‌గా…

5 hours ago

జ‌గ‌న్ ప్ర‌జ‌ల ముందుకు వ‌చ్చి ఉంటే.. !

"జ‌గ‌న్ ప్ర‌జ‌ల ముందుకు వ‌చ్చి ఉంటే.. స్థానిక ఎన్నిక‌ల్లో ఫ‌లితం ఎలా ఉండేది"- ఇదీ ఇప్పుడు వైసీపీని వెంటాడుతున్న ప్ర‌శ్న‌.…

5 hours ago

జడ్పీ పీఠాలపై వారసుల కన్ను!

పరిషత్ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెళ్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో అల్లూరి మన్యం జిల్లా మినహాయించి మిగిలిన 27 జిల్లాల్లో అధికశాతం…

6 hours ago