మెసేజింగ్ యాప్ వాట్సప్ యాజమాన్యం లేవనెత్తిన సరికొత్త వివాదం పోటీదారులైన టెలిగ్రామ్, సిగ్నల్ యాప్ లకు భలేగా కలిసొచ్చింది. వాట్సప్ యాజమాన్యం తన వాటాదారులకు సరికొత్త ప్రైవసీ పాలసీని తీసుకొచ్చింది. అదేమిటంటే వాట్సప్ యాప్ ను ఫేస్ బుక్ తో ఇంటర్ లింక్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఎందుకంటే ఫేస్ బుక్, వాట్సప్ యాప్ రెండు ఒకళ్ళవే. కాబట్టి వాట్సప్ ను ఫేసబుక్ తో ఇంటర్ లింక్ చేయటం ద్వారా ప్రైవసీ పాలసీలో మార్పలు తెచ్చింది.
అంటే ఫేస్ బుక్ లో ప్రస్తుతం ఉన్న వివరాల లాగే వాట్సప్ యాప్ కు కూడా వ్యక్తిగత వివరాలను యాజర్లు ఇవ్వాల్సుంటుంది. లేకపోత ఫేస్ బుక్ లో ఉన్న వివరాలనే తీసేసుకుంటుంది. అలాగే ఫేస్ బుక్ లో ఉన్న నిబంధనలన్నీ ఇకపై వాట్సప్ వినియోగదారులకు కూడా వర్తిస్తుంది. ఇలాంటి ప్రైవసీ పాలసీని ప్రకటించటం వల్ల వాట్సప్ యూజర్లలో ఒక్కసారిగా అలజడి మొదలైంది.
ఇదే అదునుగా వాట్సప్ పీటీ యాప్ లైన సిగ్నల్, టెలిగ్రామ్ లపై జనాల కన్నుపడింది. నిజానికి ఈ రెండు యాప్ లు కూడా వాట్సప్ పనితీరులోనే ఉంటుంది. పైగా వాట్సప్ కన్నా ఇంకా బాగా పనిచేస్తాయి. ప్రైవసీ పాలసీ అని ఎప్పుడైతే వాట్సప్ యాజమాన్యం ఎప్పుడైతే నిబంధన తెచ్చిందో యూజర్లు సిగ్నల్, టెలిగ్రామ్ యాప్ ల దృష్టి సారించారు. జనవరి 5-12 తేదీల మధ్య యాపిల్, గూగుల్ ప్లే స్టోర్ల నుండి 17.8 మిలియిన్ల యూజర్లు సిగ్నల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు.
అలాగే, సిగ్నల్ లాగే టెలిగ్రామ్ కూడా బాగా డిమాండ్ పెరిగిపోయింది. దీన్ని కూడా యూజర్లు జనవరి 5-12 మంద్య 15.7 మిలియన్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇదే సమయంలో జనవరి 5-12 మధ్య మిలియన్లలో వాట్సప్ యూజర్లు తగ్గిపోయారు. వాట్సప్ ను డౌన్ లోడ్ చేసుకునే వాళ్ళు తగ్గిపోవటమే కాకుండా తమ ఖాతాలను అన్ సబ్ స్క్రైబ్ చేసుకుంటున్న యూజర్లు కూడా మిలియిన్లలో ఉంటున్నారట. దాంతో జరుగుతున్న నష్టాన్ని గుర్తించిన వాట్సప్ యాజమాన్యం ఇపుడు లబోదిబో మంటోంది.
This post was last modified on January 15, 2021 1:07 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…