Trends

జార్జ్ క్రిష్… ఒక ప్లానింగ్ ఒక పద్దతి

2027 సంక్రాంతికి వస్తాయని చాలా సినిమాల లిస్టుగా బయటికి కనిపిస్తోంది కానీ డేట్ తో సహా వేసినవాళ్లు ఎవరూ లేకపోగా నిర్మాత అనిల్ సుంకర ఏకంగా వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూటర్ల లిస్టుతో సహా జనవరి 14 తేదీ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. శర్వానంద్ హీరోగా శ్రీనువై వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న జార్జ్ క్రిష్ ఇవాళ లాంఛనంగా ప్రారంభమయ్యింది. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీ ఎంత కాంపిటీషన్ ఉన్నా వెనుకడుగు వేసేలా లేదు.

నిజానికి ఇలాంటి ప్లానింగ్ గురించే ఇటీవల లెనిన్ సక్సెస్ ఈవెంట్ లో నాగార్జున చెప్పింది. మనం హాలీవుడ్ మేకర్స్ లాగా ఒక డేట్ ప్రకటించాక దానికి కట్టుబడి ఉండలేకపోతున్నామని, కనీసం రెండు వారాల ముందు ఫస్ట్ కాపీ సిద్ధం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం ప్యాన్ ఇండియా సినిమాలకే కాక మీడియం బడ్జెట్ మూవీస్ కూ ఎదురవుతున్న సమస్య. అలాంటిది అనిల్ సుంకర ఇంత పక్కాగా లాక్ చేసుకోవడం అందరూ ఆలోచించాల్సిన విషయం.

ఆగస్ట్, జనవరి మినహాయిస్తే కేవలం నాలుగు నెలల సమయం మాత్రమే ఉంటుంది. షూటింగ్, పాటలు, ప్రమోషన్లు, పోస్ట్ ప్రొడక్షన్ వగైరా అన్ని ఈలోగానే పూర్తి చేసుకోవాలి. ఈ సంవత్సరం సంక్రాంతికి నారి నారి నడుమ మురారితో అనిల్ సుంకర హిట్టు కొట్టిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఈ ఘనత రిపీట్ చేయబోతున్నారు. నిజానికి ఈ కాంబో మైత్రి బ్యానర్ లో అనుకున్నారు కానీ చివరికి ఏవేవో కారణాల వల్ల ఏకె ఎంటర్ టైన్మెంట్స్ తెర మీదకు వచ్చి టేకప్ చేసింది.

దర్శకుడు శ్రీను వైట్ల తన బలమైన వినోదాన్ని మరోసారి నమ్ముకోబోతున్నారు. టైటిల్ జార్జ్ క్రిష్ అని పెట్టడం చూస్తే ఏదో వెరైటీ ప్రయోగం లాగే అనిపిస్తోంది. ఒకప్పుడు ఆనందం, దూకుడు లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చి ఫన్ కి కేరాఫ్ అడ్రెస్స్ గా నిలిచిన శ్రీను వైట్ల ఆగడు తర్వాత స్పీడ్ తగ్గించారు. గోపీచంద్ విశ్వం అంచనాలు పూర్తిగా అందుకోకపోయినా ఈసారి జార్జ్ క్రిష్ తో హిట్టు కొడతారనే నమ్మకం ఆయనలో కనిపిస్తోంది. దీనికన్నా ముందు శర్వా భోగి కొత్త రిలీజ్ డేట్ ఇంకా లాక్ కావాల్సి ఉంది. 

This post was last modified on August 14, 2026 11:37 am

Share

Recent Posts

వెనుకాడొద్దు… వెంటాడండి: మంత్రుల‌కు బాబు హుకుం!

వైసీపీ చేస్తున్న ప్ర‌భుత్వ వ్య‌తిరేక రాజ‌కీయాల‌ను మంత్రులు అస్సలు ఉపేక్షించ‌వ‌ద్ద‌ని సీఎం చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. ఎక్క‌డా వెనుకాడ‌వ‌ద్ద‌ని ఆయ‌న…

6 hours ago

న్యూయార్క్ టైమ్స్ లో చంద్రబాబు విజన్

అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ దినపత్రిక న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్, అమరావతి నిర్మాణం గురించి వచ్చిన కథనం…

6 hours ago

మాజీ ఎంపీ ఐతే జైళ్లో ఫోన్ వాడుకోవచ్చా?

జైలులో శిక్ష అనుభవిస్తున్న కొందరు వీఐపీ ఖైదీలు అక్కడ కూడా రాజభోగాలు అనుభవిస్తున్న ఘటనలు అనేకం చూశాం. జైలులోనే ఫైవ్…

7 hours ago

జాన్విని మ‌ళ్లీ చూస్తామా?

బాలీవుడ్లో మంచి పేరున్న హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయ‌డం కొత్తేమీ కాదు. కానీ హిందీలో స్టార్ స్టేట‌స్ సంపాదించాక‌, తెలుగులో…

12 hours ago

చివరి సినిమా చేదు జ్ఞాపకమే అయ్యింది

గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…

13 hours ago

వైసీపీ నాయకులకు సరైన భరోసా లేదా?

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌పై కేసులు కొన‌సాగుతున్నాయి. అనేక మంది నాయ‌కుల‌పై కేసులు న‌మోదై... ప్ర‌స్తుతం విచార‌ణ ద‌శ‌లో ఉన్నాయి.…

13 hours ago