మెస్సి ఫ్యాన్స్ ఫీలవ్వకండి

Messi

ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఇండియా ఎప్పుడూ ఆడింది లేకపోయినా, ఈ సారి కూడా పోటీలో లేకున్నా.. ఆ టోర్నీ మీద మన వాళ్లకున్న ఆసక్తి తక్కువేమీ కాదు. నిన్న దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోనూ అర్ధరాత్రి ఎక్కడ చూసినా ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్ సందడే కనిపించింది. ఐతే మన జట్టు లేని టోర్నీలో ఎక్కువమంది కోరుకున్నది అర్జెంటీనా విజయాన్నే. ఎందుకంటే అది లియోనల్ మెస్సి జట్టు. అతను ఇండియన్ ఫుట్‌బాల్ లవర్స్‌కు ఎంతో ఇష్టమైన ఆటగాడు.

గత ఏడాది ఇండియాలో పర్యటించినపుడే తనకు ఇక్కడున్న క్రేజ్ ఎలాంటిదో అర్థమైంది. నాలుగేళ్ల కిందట అతను తొలిసారి ప్రపంచకప్‌ను అందుకున్నాడు. ఇప్పుడు ఇంకో కప్పుతో ఘనంగా కెరీర్‌కు వీడ్కోలు పలుకుతాడని ఆశించారు ఫ్యాన్స్. కానీ స్పెయిన్ చేతిలో అర్జెంటీనా ఓటమితో వాళ్లందరికీ తీవ్ర నిరాశ తప్పలేదు. ఇక అర్జెంటీనా అభిమానుల పరిస్థితి అయితే చెప్పాల్సిన పని లేదు. ఫుట్‌బాల్‌ను పిచ్చిగా ప్రేమించే దేశంలో ఇప్పుడు విషాదం నెలకొంది.

ఐతే నిన్న రాత్రి ఫైనల్ చూసిన వాళ్లకు అర్జెంటీనా కప్పు గెలవాల్సిన జట్టు కాదు.. స్పెయిన్‌కే ఆ అర్హత ఉందని కచ్చితంగా అర్థమవుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్ మీద ఆ ఐరోపా జట్టు ఆ స్థాయిలో ఆధిపత్యం చలాయించింది. అదనపు సమయంతో కలిపి మొత్తం 120 నిమిషాల ఆటలో బంతి పూర్తిగా స్పెయిన్ అధీనంలోనే ఉంది. ఆ జట్టు డజనుసార్లు అర్జెంటీనా గోల్ పోస్టు మీద దాడి చేసింది. కానీ అర్జెంటీనా ఒక్కటంటే ఒక్కసారి కూడా స్పెయిన్ గోల్ పోస్టు మీద ఎటాక్ చేయలేకపోయింది.

మెస్సి సహా ఏ అర్జెంటీనా స్టార్‌కూ బంతి దొరకనివ్వకుండా అద్భుతమైన డిఫెన్స్‌తో ఆకట్టుకున్న స్పెయిన్.. ఎటాక్‌లోనూ తనకు తిరుగులేదని చాటింది. పూర్తిగా మ్యాచ్‌ను ఏకపక్షం చేసిన ఆ జట్టు 106వ నిమిషంలో టోరెస్ గోల్‌తో మ్యాచ్‌ను సొంతం చేసుకుింది. అర్జెంటీనా గోల్ కీపర్ మార్టినెజ్ అద్భుత పనితనం పుణ్యమా అని మ్యాచ్ అదనపు సమయం వరకు వెళ్లింది కానీ.. స్పెయిన్ ఆడిన తీరుకు ఆ జట్టు నిర్ణీత సమయంలోనే, ఇంకా ఘనంగా మ్యాచ్ గెలవాల్సింది. అర్జెంటీనా కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయిన ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైనందుకు ఆ జట్టు అభిమానులు ఎక్కువ ఫీలవ్వాల్సిన పని లేదు. ఇక మెస్సి కెరీర్‌కు ఇలాంటి ముగింపు బాధాకరమే అయినా.. ఆల్రెడీ అతను ఒక ప్రపంచకప్ సాధించాడు కాబట్టి మరో ఫైనల్ ఆడాడన్న సంతృప్తితో నిష్క్రమించాల్సిందే.

Estimated reading time: 2 minutes

Key Takeaways

  • India has never played in the Football World Cup, yet the country’s interest remains high, especially in this final.
  • Fans favored Argentina due to Lionel Messi’s popularity, hoping for a triumphant farewell for him after winning the World Cup four years ago.
  • Argentina’s loss to Spain shocked its supporters, as Spain dominated the match and scored decisively in the 106th minute.
  • Spain’s exceptional defense prevented any attacks from Argentina, leading to Argentina’s inability to compete effectively.
  • Despite the disappointing end to Messi’s career in the World Cup, fans reflect on his previous achievements with satisfaction.