Movie News

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే కమర్షియల్ గా హిట్టా కాదానేది తేలుతుంది. పది రోజుల క్రితం విడుదలైన రావు బహదూర్ చాలా మంది విమర్శకులను ఓ మోస్తరుగా మెప్పించింది. ఫస్ట్ హాఫ్ హెచ్చుతగ్గులు ఎలా ఉన్నా సెకండాఫ్ కు మంచి సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే అనుకోకుండా నాగబంధంకు వచ్చిన హైప్ ఇటు సత్యదేవ్ మూవీ మీద ప్రభావం చూపించిన మాట వాస్తవం.

అలాని నాగబంధం సూపర్ హిట్టయ్యిందా అంటే అదీ లేదు. మూడు రోజులు బాగా హడావిడి చేసి డీసెంట్ వసూళ్లు దక్కించుకుంది కానీ పాజిటివ్ పబ్లిక్ టాక్ అయితే రాలేదు. కానీ రావు బహదూర్ కు సోమవారం నుంచి పూర్తిగా కోలుకునే ఛాన్స్ దక్కలేదు. ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోయాయి. హైదరాబాద్ లో నెంబర్లు కనిపించాయి కానీ బిసి సెంటర్స్ లో ఎదురీత తప్పలేదు. రెండో వారం పికప్ కోసం చూద్దామంటే ఊహించని విధంగా లెనిన్ పెద్ద హిట్టయిపోయి అందరినీ సైడ్ చేసింది.

రావు బహదూర్ ని ఎందరో సెలబ్రిటీలు భుజాన మోశారు. సందీప్ రెడ్డి వంగ, సుకుమార్, రాజశేఖర్, వివేక్ ఆత్రేయ మొదలైన వాళ్ళు ప్రత్యేక షోలు చూసి మరీ దర్శకుడు వెంకటేష్ మహా, హీరో సత్యదేవ్ ని ప్రశంసలతో ముంచెత్తారు. నిర్మాణ భాగస్వామిగా ఉన్న మహేష్ బాబు రిలీజ్ కు ముందు పొగడ్తలతో ట్వీట్ చేశారు కానీ తన పరిమితుల దృష్ట్యా పదే పదే ప్రమోట్ చేయలేకపోయాడు. సో ప్రముఖుల నుంచి వచ్చిన రెస్పాన్స్ జనాల నుంచి రాకపోవడమే ఇబ్బందయ్యింది.

కొన్ని ప్రయత్నాలు మంచివే. కాదనడం లేదు. థియేటర్ ఎక్స్ పీరియన్స్ కూడా ఇస్తాయి. కానీ అధిక శాతం ఆడియన్స్ కి అవి చేరనప్పుడు, వాళ్ళను కుటుంబాలతో పాటు టికెట్లు కొనేలా చేయనప్పుడు యావరేజ్ లేదా ఫ్లాప్ ముద్ర తప్పదు. రావు బహదూర్ ఏ క్యాటగిరీలోకి వస్తుందనేది కళ్ళముందు కనిపిస్తోంది. సత్యదేవ్ తన శాయశక్తులా బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు కానీ ఇకపై చేయబోయే సినిమాల్లో మాత్రం డ్రామా, కమర్షియల్ టచ్, ఎమోషన్ ప్లస్ ఎంటర్ టైన్మెంట్ తగుపాళ్ళలో ఉండేలా చూసుకోవడం తప్పనిసరి. 

This post was last modified on July 14, 2026 12:18 pm

Share

Recent Posts

బీజేపీ ఎమ్మెల్యే అక్ర‌మాల‌పై నేరుగా మోడీకే ఫిర్యాదు చేసిన ఫ్రెండ్‌!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ బీజేపీ అగ్ర‌నేత‌. ఇక‌, ఆయ‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్‌. తాజాగా మోడీ చిన్న‌నాటి స్నేహితుడు,…

23 minutes ago

రామాయణ సంగీతానికి తెర లేచింది

విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…

26 minutes ago

హైదరాబాద్ లో బాలికను రేప్ చేసిన 8 మంది

మొన్న ఢిల్లీ బస్సులో ఓ అమ్మాయిని రేప్ చేస్తే నేడు హైదరాబాద్ లో ఒకరి తర్వాత మరొకరు, ఎక్కడ దొరికితే…

45 minutes ago

జైలర్ 2 మీద పందెం కాసేదెవరు

అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. ఏపీ తెలంగాణ హక్కులు యాభై అయిదు కోట్లకు…

1 hour ago

నిర్మాత రిస్క్ చేశాడు… జాక్‌పాట్ కొడుతున్నాడు

ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఇంత‌కుముందులా ఉదారంగా కొత్త సినిమాల‌ను కొన‌ట్లేద‌న్న సంగ‌తి తెలిసిందే. నిర్మాత‌లు అడుగుతున్న రేట్లకు, వాళ్లు ఆఫ‌ర్…

2 hours ago

సుకుమార్ మీద దేవి ఫ్యాన్స్ ఎటాక్

కొంద‌రు ద‌ర్శ‌కులు టెక్నీషియ‌న్ల విష‌యంలో చాలా ప‌ర్టికుల‌ర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…

5 hours ago